https://oktelugu.com/

భారీ డైలాగులు.. పనిచేయనికి వ్యూహాలు..

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రూటే సపరేటు. డైలాగులు తప్పా.. నేరుగా ఆచరణలో దిగరు. ఇది అనేక సందర్భాల్లో రుజువైంది. 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ గెలిచిన తరువాత ప్రత్యేక హోదా ఇవ్వలేదని బీజేపీపై ఆయన పోరాటం మొదలు పెట్టారు. పాచిపోయిన లడ్డూలంటూ ప్యాకేజీపై విమర్శలు చేసిన పవన్ ప్రత్యేక హోదాకోసం తాను ఆమరణ దీక్షకు దిగుతానని ప్రకటించారు. ప్రస్తుతం ప్రత్యేక హోదాను పక్కనబెట్టిన పవన్ బీజేపీ పంచన చేరిపోయారు. Also Read: ఒప్పుకోని కుప్పం.. మేలుకున్న […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 28, 2021 / 12:15 PM IST
    Follow us on


    జనసేన అధినేత పవన్ కల్యాణ్ రూటే సపరేటు. డైలాగులు తప్పా.. నేరుగా ఆచరణలో దిగరు. ఇది అనేక సందర్భాల్లో రుజువైంది. 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ గెలిచిన తరువాత ప్రత్యేక హోదా ఇవ్వలేదని బీజేపీపై ఆయన పోరాటం మొదలు పెట్టారు. పాచిపోయిన లడ్డూలంటూ ప్యాకేజీపై విమర్శలు చేసిన పవన్ ప్రత్యేక హోదాకోసం తాను ఆమరణ దీక్షకు దిగుతానని ప్రకటించారు. ప్రస్తుతం ప్రత్యేక హోదాను పక్కనబెట్టిన పవన్ బీజేపీ పంచన చేరిపోయారు.

    Also Read: ఒప్పుకోని కుప్పం.. మేలుకున్న బాబు

    తరువాత రాజధాని అమరావతిని తరలిస్తున్నామని వైసీపీ ప్రభుత్వం ప్రకటన చేయగానే.. అమరావతి రైతులకు అండగా ఉంటామని పవన్ కల్యాణ్ మాటిచ్చారు. అవసరమైతే ఆమరణ దీక్షకు దిగుతానని హెచ్చరించారు. బెజవాడ నుంచి అమరావతివరకు మార్చ్ నిర్వహిస్తానని ప్రకటించారు. ఇవేవీ లెకుండానే అమరావతి కథను పవన్ కల్యాణ్ అలా ముగించేశారు. అమరావతి రైతుల దీక్షలు నాలుగు వందల రోజుకు చేరుతున్నా.. మళ్లీ పవన్ కల్యాణ్ అటువైపునకు చూడలేదు.

    Also Read: మార్పు మొదలైందంటున్న పవన్.. సంతోషానికి కారణమేంటి?

    ఇక విశాఖ ప్లాంటు ప్రయివేటీకరణపై పవన్ స్పందన అంతంత మాత్రంగానే ఉంది. దీనిపై ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి వచ్చారు. అయితే విశాఖ స్టీల్ ప్లాంటు ప్రయివేటీకరణకు నిరసనగా ఎలాంటి ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ఇదే నియోజకవర్గంలో ఉన్న టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ అమరణ దీక్షకు దిగారు. వైసీపీ స్టీల్ ప్లాంటు ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా పాదయాత్ర చేపట్టింది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

    పవన్ కల్యాణ్ ఈ సమయంలోనైనా స్పందించి.. ప్లాంటుకోసం ప్రత్యక్ష ఆందోళనకు దిగుతారని అంతా భావించారు. బీజేపీతో కలిసి ఉండడంతో ఆయన చెబితే పని సులువు అవుతుందని అంతా భావించారు. కానీ.. పవన్ కల్యాణ్ మాత్రం ఢిల్లీకి వెళ్లి వచ్చి మమ అనిపించారు. ఇలా పవన్ కల్యాణ్ కేవలం డైలాగులతోనే పని కానిచ్చేస్తున్నారన్న విమర్శలు పార్టీలోనే కనిపిస్తున్నాయి. చిన్న విషయాలకు కూడా దీక్షలు చేస్తానని హెచ్చరించే పవన్ కల్యాణ్ స్టీల్ ప్లాంటు విషయంలో ఆయన అనుసరించే వైఖరి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.