Pawan Lokesh : ఇటీవల ఏపీలో రాజకీయ ఉద్ధృతి మరింత పెరిగింది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పదవి కోసం టీడీపీష(TDP) నేతల డిమాండ్ చేస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్, నారా లోకేష్ మధ్య ఒక ముఖ్యమైన వివాదం తలెత్తింది. తిరుమలలో జరిగిన ఘోర తొక్కిసలాట ఘటనపై రెండు పార్టీలు, టీడీపీ జనసేన మధ్య అంతరం పెరుగుతున్నట్లు కనిపిస్తుంది. తిరుమలలో వైకుంఠ ఏకాదశి సమయంలో తిరుపతిలో తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు చనిపోయిన విషయం తెలిసిందే. ఘటన జరిగిన మరుసటి రోజు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. భక్తులకు క్షమాపణ చెప్పారు. టీటీడీ చైర్మన్, అధికారులు సైతం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం టీటీడీ చైర్మన్ క్షమాపణ చెప్పారు. అయినప్పటికీ ఈ ఘటన పట్ల రాష్ట్ర ప్రజల మనస్సులో ప్రభుత్వం పై కాస్త వ్యతిరేకత నెలకొంది. ఈ ఘటనపై ప్రభుత్వ చర్యలపై పలువురు విమర్శలు వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి పవన్ కళ్యాణ్(Pawan kalyan) వ్యాఖ్యానిస్తూ, “టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణలు చెప్పాలి” అని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో ఎన్టీఆర్ వర్ధంతికి హాజరైన లోకేష్ ను ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించారు.క్షమాపణ కోరడం పవన్ వ్యక్తిగత నిర్ణయమని నారా లోకేష్ కామెంట్ చేశారు. లోకేష్ కామెంట్స్ పై టీటీడీ, జనసేనలో చర్చ జరుగుతోంది.
జనసేన స్పందన
పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు జనసేన పార్టీ తీవ్రంగా స్పందించింది. జనసేన నేతలు, పవన్ కళ్యాణ్ పై నారా లోకేష్(nara lokesh) చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఎదురుదాడికి దారితీస్తున్నాయని చెప్పారు. ఇలాంటి మాటలు పార్టీ మధ్య మళ్లీ వివాదాలకు కారణమవుతాయని, పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రజల హృదయాలను ద్రవింపచేయడం కోసం చేసినవని అన్నారు.
స్పష్టంగా విభేదాలు
ఈ వివాదంలో స్పష్టంగా రెండు వర్గాలు ఒకే అంశంపై ఒకరికొకరు విభేదిస్తూ తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి. ఈ బాధాకర ఘటనపై రాజకీయ దృష్టికోణాలు చాలా మారాయి. ఇంతవరకు ఈ విషయంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం లేదా శాశ్వత పరిష్కారానికి ముందుకు రాలేదు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఘటన జరిగిన మరుసటి రోజు పవన్ కళ్యాణ్ తిరుపతిలో మాట్లాడుతూ, “టీటీడీ చైర్మన్ క్షమాపణలు చెప్పాలని” పేర్కొన్న సందర్భంలో ఆయనకు ప్రజల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. నారా లోకేష్, “టీడీపీ అభిప్రాయం టీటీడీ చైర్మన్ క్షమాపణలు ఇవ్వడం కాదని” చెప్పడంతో వివాదం మరింత తీవ్రమైంది. ఈ వ్యాఖ్యలు జనసేన-టీడీపీ మధ్య టెన్షన్‌ను మరింత పెంచాయి. ఇవి ప్రతిపక్ష పార్టీలు, సామాజిక మాధ్యమాల్లో వివిధ చర్చలకు దారితీస్తున్నాయి.
ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ(BJP) కలిసి కూటమిగా ఏర్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కానీ ప్రభుత్వం ఏర్పడిన 8 నెలలకే ఆధిపత్య పోరు మొదలైపోయింది. ఒకే ఒక్క ఉప ముఖ్యమంత్రిగా, బీజేపీ అండదండలతో దూకుడుగా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్‌కు చెక్ పెట్టే ప్రయత్నాలు మొదలయ్యాయని జోరుగా ప్రచారం జరుగుతుంది. అందుకు ఇటీవల జరుగుతున్న పరిణామాలే ఉదాహరణగా చెప్పొచ్చు. తిరుమల లడ్డూ విషయంలో సనాతన అవతారం ఎత్తినప్పటి నుంచి తిరుపతి తొక్కిసలాట ఘటన, రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలంపై హోంమంత్రి అనితను టార్గెట్ చేస్తూ ఏకపక్షంగా విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలో పరిస్థితి ఇలానే ఉంటే హోంశాఖను తాను తీసుకుంటానని చెప్పడం టీడీపీకి నచ్చలేదని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా తిరుపతి తొక్కిసలాట ఘటనలో చంద్రబాబుకు కావల్సిన మనిషిగా ఉన్న టీటీడీ ఛైర్మన్ బీఆఆర్ నాయుడు, టీటీడీ ఈవో శ్యామలరావులు క్షమాపణలు చెప్పాలని పవన్ కోరడం సంచలనంగా మారింది. దీంతో లోకేష్ పవన్ వ్యాఖ్యలకు విరుద్ధంగా మాట్లాడడం చూస్తుంటే పవన్ కు చెక్ పెట్టే ప్రయత్నం జరుగుతుందని తెలుస్తోంది. అలాగే డిప్యూటీ సీఎం టీడీపీ నేతలకు కట్టబెట్టాలని ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. నారా లోకేష్ కే ఆ పదవి కట్టబెడతారని కొందరు పార్టీ నేతలే ప్రతిపాదిస్తున్నారు.