
ఓ ఆరు నెలలు సినిమాలు.. మరో ఆరు నెలలు రాజకీయాలు.. ఇదీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ జీవిత చట్రం. మొన్న ఎన్నికల సందర్భంలో రాజకీయాల్లోనే ఉండిపోయారు పవన్. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు కూడా రాజకీయాల్లో కొనసాగారు. ఎలాగూ కరోనా క్రైసిస్ ఉండడంతో సినిమా షూటింగ్‌లకు బ్రేక్ పడింది. దీంతో అంతోఇంతో రాజకీయాల్లోనే కనిపించారు. ఇక ఈ మధ్య షూటింగ్‌లు ప్రారంభం కావడంతో మళ్లీ సినిమాల్లో బిజీ అయిపోయారు పవర్ స్టార్.
Also Read: టీడీపీకి షాక్.. అంగుళం భూమిని వదలని జగన్
అయితే.. సినిమాలకు విరామం ఇచ్చినా ఇవ్వకపోయినా.. రాజకీయంగా మాత్రం ఇక ప్రజల్లోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. జనవరి నుంచి ఆయన రాజకీయ కార్యాచరణ ఖరారైందని.. నెలలో కనీసం నాలుగైదు రోజులు జిల్లాల పర్యటనలు చేయబోతున్నారని నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆర్థిక అవసరాల కోసం.. సినిమాలు చేయక తప్పడం లేదని చెప్పి పవన్ కల్యాణ్ వరుస షూటింగ్‌లతో బిజీ అయిపోయారు.
తాజాగా.. జమిలీ ఎన్నికల గురించి ఇటీవలి కాలంలో ఎక్కువగా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ అంశంపై ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. పవన్ కల్యాణ్ కూడా.. తనకు ముందస్తు జమిలీ ఎన్నికల గురించి సమాచారం ఉందని ప్రకటించారు. చంద్రబాబునాయుడు అయితే.. మరో ఏడాదిన్నరలోనే జమిలీ ఎన్నికలు వస్తాయని క్యాడర్‌ను సమాయత్తం చేస్తున్నారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా నేరుగా రంగంలోకి దిగుతున్నారు. పవన్ కల్యాణ్.. చాలా సినిమాలను ఒప్పుకున్నారు. రాజకీయంగా బిజీగా ఉండటానికి ముందు.. చకచకా సినిమాలు పూర్తి చేయాలని గతంలో అనుకున్నారు. కానీ.. కోవిడ్ ఆయన ప్లాన్లను తలకిందులు చేసింది. ఇప్పుడు షూటింగ్‌లతో పాటు.. రాజకీయాల్ని కూడా సమన్వయం చేసుకోవాల్సి చూస్తున్నారు.
Also Read: ఆ చేరికలు ప్రమాదాలుగా మారుతున్నాయా..?
ఇప్పటికే పవన్ కల్యాణ్ తుపాను బాధిత రైతులను పరామర్శించారు. తర్వాత పార్టీ సమావేశాలను కూడా నిర్వహిస్తున్నారు. తిరుపతి ఉపఎన్నిక అంశంపై దృష్టిపెట్టారు. పొత్తు ధర్మాన్ని పాటిస్తూ.. అక్కడి నుంచి తమ పార్టీ అభ్యర్థిని నిలబెట్టడానికి.. మీడియాకు ఎక్కకుండా ప్రయత్నాలు చేయిస్తున్నారు. ఈ క్రమంలో.. ప్రజాసమస్యలపై బీజేపీతోపాటు.. నేరుగా ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు. ఇక ముందు బీజేపీతో భాగం అయినా అవకపోయినా.. పవన్ మాత్రం పార్టీని బలోపేతం చేయాలనే దిశగా జిల్లాల పర్యటనలు ఉండనున్నట్లుగా తెలుస్తోంది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్