https://oktelugu.com/

Pawan kalyan Sharukh Khan: షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ అరెస్ట్ పై పవన్ కళ్యాణ్ హాట్ కామెంట్స్

Pawan kalyan Sharukh Khan: ప్రతి విషయాన్ని సమయం, సందర్భం చూసి పంచులు పేల్చుతూ అధికార వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఇప్పటికే ఏపీలో డ్రగ్స్ వ్యవహారంపై పవన్ చేసిన విమర్శలకు అధికార వైసీపీ షేక్ అయ్యింది. ఇప్పుడు మరోసారి ఉత్తరాంధ్ర నేతలతో జరిగిన సమావేశంలో పవన్ ఆంధ్ర-ఒడిషా సరిహద్దుల్లో సాగవుతున్న గంజాయి సాగుపై హాట్ కామెంట్స్ చేశారు. వైసీపీ నేతలంటే చాలా భయమని.. వారి పేరు చెబితేనే గజగజ వణికిపోతానని పవన్ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 9, 2021 2:12 pm
    Follow us on

    Pawan kalyan Sharukh Khan: ప్రతి విషయాన్ని సమయం, సందర్భం చూసి పంచులు పేల్చుతూ అధికార వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఇప్పటికే ఏపీలో డ్రగ్స్ వ్యవహారంపై పవన్ చేసిన విమర్శలకు అధికార వైసీపీ షేక్ అయ్యింది. ఇప్పుడు మరోసారి ఉత్తరాంధ్ర నేతలతో జరిగిన సమావేశంలో పవన్ ఆంధ్ర-ఒడిషా సరిహద్దుల్లో సాగవుతున్న గంజాయి సాగుపై హాట్ కామెంట్స్ చేశారు.

    Pawan Kalyan questions ruling YSRCP stance  

    వైసీపీ నేతలంటే చాలా భయమని.. వారి పేరు చెబితేనే గజగజ వణికిపోతానని పవన్ ఎద్దేవా చేశారు. నువ్వు తెలుగుదేశం హయాంలో జరిగిన దాని గురించి ఎందుకు మాట్లాడవు అని పవన్ నిలదీశారు. గంజాయి సాగులో వైసీపీ తప్పు ఉందని.. వైసీపీ పాలనలో గంజాయి అభివృద్ధి చెందుతోందని విమర్శించారు.

    ఒక 13 గ్రాములు క్రూయిజ్ షిప్ లో గంజాయి దొరికింతే.. వారి పక్కన షారుఖ్ ఖాన్ కొడుకు ఉన్నాడంటనే 27 రోజులు జైల్లో పెట్టారని.. అలాగని 4వేల టన్నులు ఏపీలో పట్టుబడితే ఎంత మందిని.. ఎవరిని ఎన్ని రోజులు జైల్లో పెట్టాలో గుర్తు చేసుకోవాలని పవన్ నిప్పులు చెరిగారు.

    విపరీతమైన సంపదలు, 13 జీవనదులున్నా ఉత్తరాంధ్రలో వలసలు ఎందుకు పోతున్నారని పవన్ విమర్శించారు. ఇక్కడ రాజకీయ నేతలు సంపాదించుకుంటున్నారని.. ప్రజలను మాత్రం వెనుకబాటుతనానికి గురిచేస్తున్నారని విమర్శించారు.

    యుద్ధం అంటే నిరంతరం కొనసాగాలని.. అధికారం అంటే తనకు భయం అని.. దానికి చాలా నిబద్ధత కావాలని పవన్ కళ్యాణ్ అన్నారు. అవినీతితో నిండిపోయిన రాజకీయ వ్యవస్థను యువత, మహిళలు బద్దలు కొట్టాలన్నారు.

    మొత్తంగా విజయనగరం జిల్లా సభలో పవన్ నిప్పులు చెరిగారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఎండగట్టారు.