Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాల్లో మార్పులు వస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన మార్కు చూపించాలని తాపత్రయపడుతున్నారు. అధికారమే లక్ష్యంగా పని చేయాలని కార్యకర్తలకు సూచిస్తున్నారు. దీనిపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను మాత్రం లెక్కచేయడం లేదు. దీంతో పవన్ కల్యాణ్ పై వైసీపీ చేస్తున్న ఆరోపణలను కూడా తేలిగ్గా తీసుకుంటున్నారు. రాష్ట్రంలో వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.

ఇప్పటికే జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో వైసీపీ నేతలు ఎదురుదాడి చేయాలని చూసినా కుదరడం లేదు. వైసీపీని అధికారానికి దూరం చేసేందుకు కంకణం కట్టుకున్నారు. దాని కోసం ఎంత దూరమైనా వెళతానని ప్రకటించి వైసీపీ నేతల్లో కంగారు పుట్టించారు. భవిష్యత్ లో జనసేన తన సత్తా చాటడం మాత్రం కచ్చితమే అని తెలుస్తోంది. అయితే పొత్తుల విషయంలో వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను కూడా ఖండిస్తున్నారు.
Also Read: CM KCR- Governor Tamilisai: ఢిల్లీకి చేరిన సీఎం, గవర్నర్ పంచాయితీ?
చంద్రబాబుతో పొత్తుకు పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తున్నారని వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు సరైన రీతిలో జనసేన కూడా సమాధానం చెబుతోంది. రాష్ర్టంలో అధికారంలోకి వచ్చేందుకు అన్ని మార్గాలు అన్వేషిస్తున్నారు. దీంతో వైసీపీ నేతలకు మింగుడు పడటం లేదు. వారిలో ఆత్మవిశ్వాసం కొరవడుతున్నట్లు కనిపిస్తోంది. అందుకే చీటికి మాటికి జనసేన పై విమర్శలు గుప్పిస్తూ పబ్బం గ గడుపుకోవాలని చూస్తున్నారు.

రాబోయే రోజుల్లో పొత్తులు ఎలా ఉన్నా ఏపీలో వైసీపీని మాత్రం గద్దెదించేందుకే జనసేన ప్రయత్నిస్తోంది. జనసేనలోకి పలు పార్టీల నుంచి వచ్చేందుకు నేతలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. భవిష్యత్ లో విజయాలు సాధించాలని ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నారు. వైసీపీని కూకటి వేళ్లతో పెకిలించి దాన్ని అధికారంలోకి రాకుండా చేయాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. జనసేన నేతల్లో ఉత్సాహం నింపేందుకు పవన్ కల్యాణ్ ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు నేతలను పోటీకి దింపేందుకు తయారు చేస్తున్నారు. వైసీపీ నేతలను ఎదుర్కొని ఎదురు నిలిచి విజయం సాధించే విధంగా వారిలో ఆత్మవిశ్వాసం నింపుతున్నారు.
Also Read:CM Jagan Delhi Tour: సీఎం జగన్ లో కనిపించని జోష్.. ఢిల్లీ పర్యటన తుష్
[…] AP Cabinet Expansion: ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ విస్తరణపై జగన్ దృష్టి సారించారు. కసరత్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే గవర్నర్ విశ్వభూషన్ హరంచందణ్ తో సమావేశమై చర్చించారు. మంత్రివర్గ కూర్పు, ప్రమాణస్వీకారం తదితర విషయాలపై మాట్లాడారు. ఇక ముహూర్తం ఈ నెల 11న ఖరారు కావడంతో దానికి సంబంధించిన అన్ని విషయాలు పూర్తి చేశారు. మొత్తం లిస్టు ఆయన దగ్గరే ఉంది. ఎవరికి ఉద్వాసన పలుకుతున్నారు? ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారనే విషయాలపై ఎవరికి తెలియడం లేదు. దీంతో అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. […]