Anchor In A Live In Relationship: తెలుగు బుల్లితెరపై ప్రముఖ పురుష యాంకర్ పెళ్లి ఎప్పుడన్నది ఇప్పుడు హాట్ టాపిక్. అతడి పెళ్లి కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న వారు ఎందరో.. ప్రతి షోలోనూ ‘నీ పెళ్లి ఎప్పుడు?’ అని అందరూ అడుగుతూనే ఉంటారు. ఇదివరకూ అతడి పెళ్లిపై రెండు మూడు షోలు కూడా నిర్వహించారంటే ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ యాంకర్ గురించి అర్థం చేసుకోవచ్చు.

ఈ ప్రముఖ పురుష యాంకర్ అనేక గాసిప్ కథనాలకు ప్రసిద్ధం చెందారు.సోషల్ మీడియాలో అతడి యాంకరింగ్ నైపుణ్యాల కంటే అతడి ఆఫ్ స్క్రీన్ యవ్వరాల గురించే ఎక్కువగా చర్చించుకుంటున్నారు. అప్పట్లో ఈ యాంకర్ ఒక పెద్ద కుటుంబానికి చెందిన ఒక అమ్మాయితో చాలా క్లోజ్ ఫ్రెండ్ గా మెలిగాడు. గోవాలో ఆ అమ్మాయితో ఎంజాయ్ కూడా చేసినట్టు టాక్ బయటకు వచ్చింది.ఈ విషయం వాళ్ల తల్లిదండ్రులకు తెలియడంతో వారిద్దరి మధ్య విభేదాలకు కారణమై వారి సంబంధం తెగిపోయిందట.. కానీ ఇప్పటికీ అతడికి వివిధ ఎఫైర్లు, అమ్మాయిలంటూ గాసిప్ లు వెలువడుతూనే ఉన్నాయి.

తాజాగా ఈ పురుష యాంకర్ మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడని గుసగుసలు బయటకొచ్చాయి. ఆ మహిళ వివరాలు ఇంకా తెలియరాలేదు.. కానీ ఆమె విడాకులు తీసుకున్నట్లు సమాచారం. ఈ సంబంధం సహజీవనాన్ని దాటి పెళ్లి వరకూ వస్తుందా? లేదా ఆగిపోతుందా? అన్నది ఎదురుచూడాలి. ఇతగాడి కొత్త ఎఫైర్ మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.