Pawan Kalyan – Kapu : కాపు సామాజిక వర్గానికి దిశానిర్దేశం చేసిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan – Kapu : రాష్ట్ర రాజకీయాల్లో బలమైన ఓటు బ్యాంకు కలిగిన సామాజిక వర్గాల్లో కాపు సామాజిక వర్గం అత్యంత కీలకమైనది. రాష్ట్రంలో మెజారిటీ జనాభా కాపు సామాజిక వర్గానిదే అయినప్పటికీ రాజకీయంగా ఉన్నత స్థానం వీరికి దక్కడం లేదు. గత కొన్నేళ్లుగా రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన అప్పటి కాంగ్రెస్, ఆ తర్వాత ఏర్పడిన తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కాపు నేతలు బలమైన నేతలుగా ఎదుగుతున్నారే తప్ప సీఎం సీటు వరకు వెళ్లే […]

Written By: NARESH, Updated On : March 13, 2023 8:01 pm
Follow us on

Pawan Kalyan – Kapu : రాష్ట్ర రాజకీయాల్లో బలమైన ఓటు బ్యాంకు కలిగిన సామాజిక వర్గాల్లో కాపు సామాజిక వర్గం అత్యంత కీలకమైనది. రాష్ట్రంలో మెజారిటీ జనాభా కాపు సామాజిక వర్గానిదే అయినప్పటికీ రాజకీయంగా ఉన్నత స్థానం వీరికి దక్కడం లేదు. గత కొన్నేళ్లుగా రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన అప్పటి కాంగ్రెస్, ఆ తర్వాత ఏర్పడిన తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కాపు నేతలు బలమైన నేతలుగా ఎదుగుతున్నారే తప్ప సీఎం సీటు వరకు వెళ్లే అవకాశం లేకుండా పోతోంది. అయితే గత కొన్నేళ్లుగా ఈ సామాజిక వర్గ ముఖ్య నేతల్లో వచ్చిన మార్పు, ఆలోచనతో రాజ్యాధికారకాంక్ష పెరిగింది.

కాపులు బలమైన శక్తిగా నిలబడాలని కోరుకునే వ్యక్తుల్లో ముందుండేది పవన్ కళ్యాణ్. అటువంటి ఆలోచన కలిగిన వ్యక్తులను ఏకతాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నాన్ని పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. దీనికి కాపు సామాజిక వర్గంలోని ముఖ్య నేతల నుంచి మంచి స్పందన వస్తున్నట్లు కనపడుతుంది. ముఖ్యంగా కాపులు గురించి, కాపు సామాజిక వర్గాల ఆర్థిక స్థితిగతులు, వారి ఇబ్బందులు గురించి స్పష్టమైన అవగాహన ఉన్న పవన్ కళ్యాణ్ వెనుక నిలబడడం ద్వారా కాపుల రాజ్యాధికార కాంక్షను నెరవేర్చుకోవడంతోపాటు బలమైన రాజకీయ, ఆర్థిక శక్తిగా అవతరించేందుకు అవకాశం ఉందన్న భావనను కాపు సామాజిక వర్గంలోని కీలక నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఈ భావన ఉన్న నేతలు మిగిలిన వారిని పనుబాటలో నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల నాటికి కాపులను ఏకతాటి పైకి నడిపించేందుకు చేస్తున్న ప్రయత్నాలు కొంత వరకు సత్ఫలితాలను ఇచ్చే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

కాపు సామాజిక వర్గానికి దిశానిర్దేశం చేసిన పవన్ కళ్యాణ్ రాజకీయ అడుగులపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.