Pawan kalyan : KGF సినిమాలో రీ రికార్డింగ్ చేసుకొని విలన్స్ తో పోరాడడం చాలా తెలీక..కానీ నిజ జీవితం లో ధైర్యం ఉండాలి : పవన్ కళ్యాణ్

కాకినాడ సభలో పవన్ కళ్యాణ్ KGF సినిమాని ఉదహరిస్తూ చెప్పిన ఒక మాట ఇప్పుడు సోషల్ మీడియా అంతటా వైరల్ గా మారింది. ఆయన మాట్లాడుతూ ' అందరూ KGF సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చూసి , విలన్స్ ని అలా ఎదురుకోవాలి

Written By: NARESH, Updated On : June 18, 2023 10:38 pm

Pawan Kalyan

Follow us on

Pawan kalyan : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మొత్తం ఇప్పుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న ‘వారాహి విజయ యాత్ర’ చుట్టూ తిరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఏ ఇద్దరు మాట్లాడుకుంటున్నా ఇప్పుడు వారాహి యాత్ర గురించే మాట్లాడుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఇస్తున్న ప్రసంగాలు జనాలను ఎంతో ఆకట్టుకుంటున్నాయి, ఎన్నడూ లేని విధంగా గతం లో పవన్ కళ్యాణ్ ని విమర్శించిన వాళ్ళు కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని పొగుడుతున్నారు.

వచ్చే ఎన్నికలలో మా ఓటు నీకే అంటూ ట్వీట్స్ వేస్తున్నారు. వీటిని చూసి పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో మురిసిపోతున్నారు. తమ అభిమాన నాయకుడి రాజకీయ యాత్రకు రోజు రోజుకు జనాల్లో పెరుగుతున్న ఆదరణ చూసి ఇదే కదా మేము ఇన్ని రోజులు కోరుకున్నాడో , వారాహి యాత్ర కచ్చితంగా జనసేన పార్టీ ని ప్రభుత్వం లోకి తీసుకొస్తుందని బలమైన నమ్మకం తో ఉన్నారు.

ఇది ఇలా ఉండగా నేడు జరిగిన కాకినాడ సభలో పవన్ కళ్యాణ్ KGF సినిమాని ఉదహరిస్తూ చెప్పిన ఒక మాట ఇప్పుడు సోషల్ మీడియా అంతటా వైరల్ గా మారింది. ఆయన మాట్లాడుతూ ‘ అందరూ KGF సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చూసి , విలన్స్ ని అలా ఎదురుకోవాలి అని వెండితెర మీద చూసి చప్పట్లు కొట్టడం కాదు, నిజ జీవితంలో కూడా మీరు అలా తయారవ్వాలి, రౌడీలకు , గూండాలకు సమూహంగా వెల్లో సమాధానం ఇవ్వాలి. నేను అలా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. చంద్ర శేఖర్ రెడ్డి లాంటి రౌడీ ని, వైఎస్ జగన్ లాంటి నటోరియస్ ఫ్యాక్షన్ బావాలు ఉన్న వ్యక్తితో పోరాటం చేస్తున్నాను. నీ రోజులు దగ్గర పడ్డాయి గుర్తు పెట్టుకో ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, నీ క్రిమినల్ సామ్రాజ్యాన్ని నేలమట్టం చేసి మీ జగన్ మోహన్ రెడ్డిని రోడ్డు మీదకి తీసుకొస్తాను’ అంటూ పవన్ కళ్యాణ్ ఇచ్చిన ప్రసంగం బాగా వైరల్ అయ్యింది.