Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan : బాపట్లలో 14 ఏళ్ల బీసీ కుర్రాడిని నిలువున నిలబెట్టి తగలబెడితే బీసీ...

Pawan Kalyan : బాపట్లలో 14 ఏళ్ల బీసీ కుర్రాడిని నిలువున నిలబెట్టి తగలబెడితే బీసీ నాయకులూ ఏమి చేస్తున్నారు : కాకినాడ సభలో పవన్ కళ్యాణ్

Pawan Kalyan : గత మూడు రోజుల నుండి పవన్ కళ్యాణ్ జనసేన ‘వారాహి విజయ యాత్ర’ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఏ రాజకీయ పార్టీ కి కూడా రానటువంటి రెస్పాన్స్ , ఈ వారాహి యాత్ర ద్వారా జనసేన పార్టీ కి వస్తుంది, ఈ స్థాయి అనూహ్యమైన రెస్పాన్స్ ఇది వరకు పవన్ కళ్యాణ్ సభలకు వచ్చాయి, ఇది కొత్తేమి కాదు, కానీ ఈ ‘వారాహి విజయయాత్ర’ కి మాత్రం ఇతర హీరోల అభిమానుల నుండి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది.

రాష్ట్రంలో జనాలపై వైసీపీ పార్టీ చేస్తున్న దౌర్జన్యాలు, పూసగుచ్చినట్టుగా మొన్న పిఠాపురం సభలో చెప్పగా, అవి సోషల్ మీడియా మొత్తం వైరల్ గా మారింది. ఎక్కడ చూసినా దీని గురించే ప్రస్తుతం మాట్లాడుకుంటున్నారు. ఇక కాకినాడలో నేడు జరిగిన భారీ బహిరంగ సభలో కూడా పవన్ కళ్యాణ్ వైసీపీ చేస్తున్న అక్రమాలను చెప్పుకొచ్చాడు.

ముఖ్యంగా రీసెంట్ గా బాపట్ల లో జరిగిన ఒక సంఘటన గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘ ఈమధ్యనే బాపట్ల లో ఒక BC బిడ్డని పొలం లో చెట్టుకు కట్టేసి నిలువున తగలబెట్టి చంపేస్తే, ఒక్కరు కూడా పట్టించుకోలేదు. బీసీ సంఘ నాయకులూ ఏమి చేస్తున్నారు?, న్యాయం చేయాల్సిన ఒక బీసీ ఎంపీ లక్ష రూపాయిల కట్ట పట్టుకుని వచ్చి భేరాలు ఆడుతున్నారు, ఒక ప్రాణాన్ని చంపేసి విలువ కడతారా, ఇలాంటి నాయకుల మధ్యన మనం బ్రతుకుతున్నది, ఇలాంటి నాయకులనా మనం ఎన్నుకుంటున్నది. ఒక్కసారి ఆలోచించండి ఈ ప్రభుత్వం లో లా & ఆర్డర్ ఏ స్థాయిలో పనిచేస్తుందో’ అంటూ చెప్పుకొచ్చారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘నిన్న జనవాణి కార్యక్రమం లో ఒక మహిళ వచ్చి చెప్పింది, నేను వస్తున్నానని పోస్టర్లు అతికిస్తుంటే కొంతమంది ద్వారంపూడి అనుచరులు నెంబర్ ప్లేట్ లేని వాహనాలు వేసుకుని వచ్చి చంపేస్తాం అని బెదిరిస్తున్నారు అంట’ అంటూ వైసీపీ పార్టీ కార్యకర్తలు చేస్తున్న బెదిరింపులు గురించి చెప్పుకొచ్చాడు.

https://www.youtube.com/watch?v=EaILFxLjAmY

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version