తెలుగుదేశం పార్టీకి ఉన్న కంచుకోటల్లో గుడివాడ ఒకటి. ఇక్కడి నుంచి ప్రతిసారి టీడీపీ విజయం సాధిస్తుంది. ఎన్టీఆర్ నుంచి నాని దాకా అందరూ విజేతలే. 1989లో మాత్రం కాంగ్రెస్ గెలిచింది. కానీ ఇప్పుడు వైసీపీ మంత్రి కొడాలి నాని తన అడ్డాగా మార్చుకున్నారు. 2004లో జూనియర్ ఎన్టీఆర్ సిఫార్సుతో తొలిసారి టికెట్ దక్కించుకున్న నాని 2004,2009లో టీడీపీ నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. 2014,2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి మరో రెండుమార్లు విజయం సాధించారు. ప్రతిసారి నానికి కలిసి రావడంతో ఇక్కడ గెలుపు సునాయాసం అయింది.
విజయవాడలో యువనేత దేవినేని అవినాష్ ను పోటీలో ఉంచారు. అయితే ఆయన గట్టి పోటీ ఇస్తారని భావించినా జనసేన నుంచి పోటీలో ఉన్న వ్యక్తి తప్పుకోవడంతో కాపుల ఓట్లు చీలిపోయాయి. దీంతో నాని అనూహ్యంగా గెలిచారు. అదే జనసేన అభ్యర్థి పోటీలో ఉంటే కాపుల ఓట్లు చీలకుండా పడితే నాని గెలుపు కష్టమయ్యేది. నాని మంత్రి అయ్యాక పవన్ కల్యాణ్ ను నాని దారుణమైన పదజాలంతో విమర్శలు చేశారు.
రాబోయే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ నానికి గట్టి పోటీ ఇస్తారని భావిస్తున్నారు. నానిని టార్గెట్ చేసి ఆయన గెలుపు అంత సునాయాసంగా కాకుండా చూసేందుకు పవన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. కాపుల ఓట్లు చీలకుండా చేసేందకు గట్టి అభ్యర్థిని నిలబెట్టే ఆలోచనలో పవన్ ఉన్నట్లు తెలుస్తోంది.
గుడివాడల బలమైన అభ్యర్థిని నిలిపి నానిని ఎలాగైనా ఓడించాలనే కసితో జనసేన ఉంది. టీడీపీ కూడా నాని విషయంలో అంతే పగతో రగులుతోంది. అవసరమైతే పవన్ కల్యాణ్ ఇక్కడ కమ్మ రాజకీయ ప్రాబల్యం ఎక్కువగా ఉండడంతో వారిని ఆకట్టుకోవడానికి జనసేన నుంచి కూడా కమ్మలకే సీటు ఇవ్వాలని చూస్తున్నారు. దీంతో ఈసారి నానికి పవన్ గండం పొంచి ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.