Pawan Kalyan BJP: ఏపీలో వేగంగా మారుతున్న రాజకీయం – ఢిల్లీ కి పవన్ కళ్యాణ్…!

Pawan Kalyan BJP: ఏపీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళుతున్నారు. కేంద్రంలోని బీజేపీ పెద్దలు పవన్ ను ఢిల్లీకి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. విశాఖలో నిర్బంధం తర్వాత పవన్ కళ్యాణ్ బరెస్ట్ కావడం.. ఆయనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కలిసి మరీ సంఘీభావం తెలిపిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఏపీలో బీజేపీ, జనసేన రెండూ పొత్తు పెట్టుకొని ఉన్నాయి. అయితే ఈ పొత్తులోకి సడెన్ గా 40 ఇయర్స్ పాలిటిక్స్ చంద్రబాబు ఎంట్రీ ఇచ్చారు. […]

Written By: NARESH, Updated On : October 19, 2022 9:08 pm
Follow us on

Pawan Kalyan BJP: ఏపీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళుతున్నారు. కేంద్రంలోని బీజేపీ పెద్దలు పవన్ ను ఢిల్లీకి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. విశాఖలో నిర్బంధం తర్వాత పవన్ కళ్యాణ్ బరెస్ట్ కావడం.. ఆయనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కలిసి మరీ సంఘీభావం తెలిపిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఏపీలో బీజేపీ, జనసేన రెండూ పొత్తు పెట్టుకొని ఉన్నాయి.

అయితే ఈ పొత్తులోకి సడెన్ గా 40 ఇయర్స్ పాలిటిక్స్ చంద్రబాబు ఎంట్రీ ఇచ్చారు. పవన్ ను మచ్చి క చేసుకునేందుకు ఈ సందర్భాన్ని చక్కగా వాడుకున్నారు. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల వేళ మోడీని, బీజేపీని చీట్ చేసి కాంగ్రెస్ కు మద్దతు తెలిపిన చంద్రబాబును నమ్మే స్థితిలో బీజేపీ పెద్దలు లేరు. 40 ఇయర్స్ పాలిటిక్స్ చంద్రబాబు అధికారం కోసం ఏమైనా చేయగలరు. ఎంతదాకా అయినా దిగజారగలడు. అలాంటి బాబు పాలిటిక్స్ తెలుసు కనకనే పవన్ కళ్యాణ్ ఆ మాయలో పడకుండా ఢిల్లీ బీజేపీ పెద్దలు అలెర్ట్ అయినట్టు తెలుస్తోంది. ఒకవేళ పవన్ ను ఒప్పించి చంద్రబాబు పొత్తు కుదుర్చుకుంటారని భయపడిన కమలనాథులు వెంటనే పవన్ ను ఢిల్లీకి పిలిచినట్టు తెలుస్తోంది.

ఇప్పటికే బీజేపీ రూట్ మ్యాప్ ఇవ్వగానే ఏపీలో తన పని మొదలుపెడుతానని పవన్ ప్రకటించారు. ఈ క్రమంలోనే ఇటీవల అభిప్రాయ భేదాలు పొడచూపాయి. బీజేపీ పెద్దల వ్యాఖ్యలతో పవన్ ఒంటరి పోరాటం మొదలుపెట్టారు. ఏపీలో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. జనవాణి, కౌలు రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు.

వైసీపీ ఉక్కుపాదం మోపుతూ పవన్ పై నిర్బంధకాండ చేస్తుండడంతో బీజేపీ అండగా నిలవాలని యోచిస్తోంది. అందుకే ఢిల్లీకి పవన్ ను పిలిపించి ఏపీ రాజకీయాలపై భరోసా కల్పించడంతోపాటు రూట్ మ్యాప్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. చంద్రబాబు లాంటి ఊసరవెళ్లి నేతలను నమ్మడం కంటే తమతో కొనసాగితే మేలు అని పవన్ ను అక్కున చేర్చుకోవడానికి ఢిల్లీ పెద్దలు యోచిస్తున్నారట.. ఈ మేరకు పవన్ ను ఢిల్లీ పిలిపించినట్టు తెలుస్తోంది. పవన్ ఢిల్లీ వెళ్లాక ఏపీ రాజకీయాల్లో జగన్ కు చెక్ పడుతుందని.. ఆయనపై కేసులు ఇతర విషయాల్లో కేంద్రం టైట్ చేస్తుందన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.