Andes Plane Crash: కొన్ని సార్లు ఆపద సమయాల్లో ఏం చేయాలో కూడా అర్థం కాదు. విమాన ప్రమాదంలో గాయపడిన వారికి ఏం దొరకక నరమాంసం తిన్న ఘటన సంచలనం కలిగించింది. కానీ అది ఇప్పుడు కాదు ఎప్పుడో యాభై ఏళ్ల క్రితం 1972 డిసెంబర్ 23న రెస్క్యూ సిబ్బంది అక్కడకు చేరుకునే దాకా వారికి నరమాంసమే ఆహారంగా మారింది. దీంతో నోటిలో పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉన్నా తప్పకపోవడంతో వారి పరిస్థితి దారుణంగా మారింది. చనిపోయిన వ్యక్తుల మాంసాన్ని తిని వారు ప్రాణాలతో బయటపడటం గమనార్హం. ఈ ప్రమాదంలో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. తరువాత 13 మంది చనిపోయారు. ఇక మిగిలిన వారు బతకాలంటే వారి మాంసాన్ని తినక తప్పని పరిస్థితుల్లో వారు నరమాంసాన్ని తిన్నారు.

1972 అక్టోబర్ 13న ఉరుగ్వేకు ఎయిర్ ఫోర్స్ కు చెందిన ప్రత్యేక విమానం 571లో రగ్బీ ఆటగాళ్లు వారి కుటుంబసభ్యులతో ఆండీస్ పర్వత శ్రేణుల్లో వెళ్తుండగా విమానం కూలిపోయింది. దీంతో ఇందులో 16 మంది మృత్యువును జయించారు. నరమాంసం తినడం అంత సులభం కాదు. దానికి ఎంతో ధైర్యం కావాలి. కానీ ఆ సమయంలో తమ ప్రాణాలు కాపాడుకోవడానికి వారికి వేరే దారి కనిపించలేదు. తమ ప్రాణాలు దక్కించుకోవాలంటే వారు తప్పకుండా మనుషుల మాంసమే తినాలి. లేకపోతే వారికి ప్రాణాలు నిలవవు. వారు ఉన్న చోటు ఎవరికి తెలియదు.
కెనెస్సా అనే వైద్య విద్యార్థి మనం జీవించాలంటే మృతదేహాలను తినాల్సిందే. లేదంటే గత్యంతరం లేదని చెప్పడంతో ఇక చేసేది లేక అందరు వారి మాంసాన్ని తిన్నారు. గాజు ముక్కలను ఉపయోగించి వారి శరీర బాగాలు కోసుకుని తినడంతో వారికి అసహ్యం వేసినా తప్పలేదు. ఆనాటి సంఘటన గురించి గుర్తుకు చేసుకుని అందరు ఎంతో బాధ వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాణాలు నిలుపుకోవడానికి తప్పనిసరి పరిస్థితుల్లో మానవ శరీరాలను కోసుకుని తినడం ఇప్పటికి మరిచిపోలేం అని విచారం వ్యక్తం చేస్తున్నారు.

విమాన ప్రమాదం నుంచి బయటపడిన వీరిని ఆస్పత్రికి తరలించారు. ఆండీస్ అడవుల్లో గాయపడిన ఇద్దరు పది రోజులు ప్రయాణించి తోటి ప్రయాణికులు ప్రాణాలతో ఉన్నారని అధికారులకు తెలియజేయడంతో వారి ఆచూకీ లభ్యమైంది. లేకపోతే వారు కూడా అక్కడే చనిపోయేవారు. హెలికాప్టర్ సాయంతో రెస్క్యూ సిబ్బంది అక్కడకు చేరుకుని అందరిని రక్షించారు.