జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వైసీపీపై చేస్తున్న విమర్శలు తారాస్థాయికి చేరాయి. జగన్ ను ఇరుకున పెట్టాలనే తపనతోనే పవన్ కల్యాణ్ ఇదంతా చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు జగన్ స్పందించడం లేదు. కానీ కావాలనే ఆయనలో కోపం తెప్పించాలనేదే ఆయన తాపత్రయం అని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో కూడా ఇలాగే చేస్తే జగన్ పేల్చిన బాంబుకు పవన్ తట్టుకోలేకపోయారు.
ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా ఆ విధంగానే చేస్తారనే అందరు ఆశిస్తున్నా జగన్ పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. కానీ పవన్ కల్యాణ్ మాత్రం తన ప్రయత్నం ఆపడం లేదు. జనసేన కార్యకర్తల్లో ఐక్యత తెచ్చేందుకు పావులు కదుపుతున్నారు. ప్రభుత్వంపై పోరాడుతూ ప్రజాసమస్యల పరిష్కారంలో ముందుండాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల గాంధీ జయంతి రోజున శ్రమదానం చేసి ప్రభుత్వ విధానాన్ని ఎండగట్టారు.
ఇలా ప్రభుత్వాన్ని పరేషాన్ చేసే క్రమంలో జనసేన ఎప్పుడు ముందుంటుందని తెలియజెప్పేందుకే పవన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఏపీలో రాజకీయంగా ఎదిగేందుకు పక్కా ప్రణాళిక రచిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో జగన్ ను ఎలాగైనా ఎదుర్కోవాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఆయనపై విమర్శలకు దిగుతున్నారు.
ఏపీలో నిలదొక్కుకోవాలని పవన్ కల్యాణ్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో వైసీపీని ఎదుర్కోవడం టీడీపీతో కాకపోవడంతోనే పవన్ కల్యాణ్ రంగంలోకి దిగినట్లు చెబుతున్నారు. జగన్ అక్రమాలపై తనదైన శైలిలో విమర్శలు చేస్తూ వారిని ఇరుకున పెట్టాలని చూస్తున్నారు. కానీ పవన్ ప్లాన్ మాత్రం వర్కవుట్ అవుతుందో లేదో అనే అనుమానాలు అందరిలో నెలకొన్నాయి.
