ముంబై తీరంలో ఒక క్రూయిజ్ షిప్‌లో రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకుంటూ బాలీవుడ్ సూపర్ స్టార్ ‘షారుక్ ఖాన్‘ కొడుకు ‘ఆర్యన్ ఖాన్’ అడ్డంగా బుక్ అయిన సంగతి తెలిసిందే. ఈ డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ తో పాటు ఎనిమిది మందిని ఎన్‌సీబీ అధికారులు విచారించగా సంచలన నిజాలు బయట పడ్డాయి. ముఖ్యంగా కస్టడీలో ఆర్యన్ ఖాన్ షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు. ఆర్యన్ గత నాలుగు సంవత్సరాలుగా డ్రగ్స్ తీసుకుంటున్నట్లు అధికారులకు చెప్పాడు. మొదటిసారి యూకేలో ఉన్నప్పుడు డ్రగ్స్ తీసుకున్నాడట.

ఆ తర్వాత దుబాయ్, ఇతర దేశాల్లో చదువుకునే రోజుల్లో డ్రగ్స్ తీసుకున్నాడట. నిజంగా ఇది షాకింగే. తన కుమారుడు డ్రగ్స్ కి బానిస అయ్యాడని.. గత నాలుగేళ్లల్లో షారుక్ ఖాన్ కి తెలియలేదా ? లేక తెలిసినా పట్టించుకోలేదా ? నిజానికి గతంలో షారుఖ్ కూడా డ్రగ్స్ కి అలవాటు అయ్యాడని రూమర్స్ వచ్చాయి. కానీ డ్రగ్స్ కేసులో షారుఖ్ కొడుకు బుక్ అవ్వడం విచిత్రమే.
ఇక తన కుమారుడు కస్టడీలో ఉన్నా షారుఖ్ బాధ పడటం లేదట. జీవితంలో అందరూ తప్పులు చేస్తారని.. అలాగే నా కుమారుడు తప్పులు చేశాడని.. ఆర్యన్ లో మార్పు వచ్చే సమయం త్వరలోనే వస్తోందని షారుఖ్ తన సన్నిహితులు దగ్గర చెబుతున్నాడట. ఇక పోలీసుల విచారణలో తన కుమారుడితో షారుఖ్ రెండు నిమిషాల పాటు మాట్లాడి దైర్యం చెప్పినట్లు తెలుస్తోంది.
ఎందుకంటే విచారణ సమయంలో ఆర్యన్ ఖాన్ కంటిన్యూగా ఏడుస్తూనే ఉన్నాడట. అధికారుల కాళ్ళు పట్టుకుని వదిలిపెట్టమని బతిమిలాడినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసే.. షారుఖ్ ఆర్యన్ తో వీడియో కాల్ మాట్లాడి.. ఓదార్చే ప్రయత్నం చేశాడు. అయితే, ఆ తర్వాత అధికారులు ఆర్యన్ ఫోన్ లో కాల్స్ డేటాను, చాట్స్‌ను పరిశీలిస్తే.. కొంతమంది యంగ్ హీరోయిన్స్ కి కూడా డ్రగ్స్ కేసులో లింక్స్ ఉన్నాయని అంటున్నారు.
నటీనటులకు డ్రగ్స్ కు అవినాభావ సంబంధం ఉందని ఇప్పటికే బలమైన ఆరోపణలు ఉన్న నేపథ్యంలో.. ఇలా కొత్త భామలు, బుడ్డ స్టార్లు డ్రగ్స్ మత్తులో చిత్తుగా దొరికితే.. నష్టం సినిమా ఇండస్ట్రీకే. ఏది ఏమైనా సినిమా పక్షులు మాత్రం మత్తును బాగా ఇష్టపడతారు. ఆ మత్తులోనే బతకాలని ఆశ పడతారు. చివరకు ఆ మత్తునే చిత్తు అయిపోతారు.