Janasena Formation Day: నేడే జనసేన 9వ ఆవిర్భావ దినోత్సవం.. పవన్ ఏం చెప్పనున్నారు?

Janasena Formation Day: జనం మనిషిగా. జనం కోసం ‘జనసేన’ స్థాపించారు పవన్ కళ్యాణ్. ఆ పార్టీ పుట్టి నేటికి 9 ఏళ్లు అవుతోంది.అందుకే ఈపండుగను ఘనంగా చాటడానికి ఏపీ నడిబొడ్డున ఆవిర్భావ సభను ఏర్పాటు చేశారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా జనసేన అధినేత సమరశంఖం పూరించడానికి రెడీ అయ్యారు. ఎన్నికల మేనిఫెస్టోను కూడా పవన్ ఈ సభలో ప్రకటిస్తారని సమాచారం అందుతోంది.అదే జరిగితే అదొక పెద్ద సంచలనమే అవుతోంది. 9వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ […]

Written By: NARESH, Updated On : March 14, 2022 11:57 am
Follow us on

Janasena Formation Day: జనం మనిషిగా. జనం కోసం ‘జనసేన’ స్థాపించారు పవన్ కళ్యాణ్. ఆ పార్టీ పుట్టి నేటికి 9 ఏళ్లు అవుతోంది.అందుకే ఈపండుగను ఘనంగా చాటడానికి ఏపీ నడిబొడ్డున ఆవిర్భావ సభను ఏర్పాటు చేశారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా జనసేన అధినేత సమరశంఖం పూరించడానికి రెడీ అయ్యారు. ఎన్నికల మేనిఫెస్టోను కూడా పవన్ ఈ సభలో ప్రకటిస్తారని సమాచారం అందుతోంది.అదే జరిగితే అదొక పెద్ద సంచలనమే అవుతోంది. 9వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ చేసే ప్రసంగమే హైలెట్ గా నిలవబోతోందని సమాచారం.

Janasena Formation Day

జనసేన 9వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సిద్ధమయ్యారు జనసైనికులు. గుంటూరు కేంద్రంగా జనసేనాని ఏపీ భవిష్యత్ రాజకీయాలను దిశానిర్ధేశం చేసేలా పక్కా ప్రణాళికతో ఈ సభను నిర్వహించనున్నారని తెలిసింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామ సమీపంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ వేదికకు ‘దామోదరం సంజీవయ్య’ పేరు పెట్టారు. ఆవిర్భావ సభ కోసం పాటను కూడా జనసేన పార్టీ రిలీజ్ చేసింది.

Also Read: Nandamuri Balakrishna Movie On yvs Chowdary: ఇలా కూడా ఛాన్స్ ఇస్తారా ? బాలయ్య మాత్రమే ఇస్తాడు

ఇక జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ కీలక ప్రసంగం చేయనున్నారు. ఇప్పటికే పవన్ అమరావతి చేరుకున్నారు. ఆదివారం రాత్రి గన్నవరం ఎయిర్ పోర్టులో పవన్ కళ్యాణ్ కు అభిమానులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఇక అంతకుముందే పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి జనసేనాని పవన్ కళ్యాణ్ ఓ వీడియోను విడుదల చేశారు. రాష్ట్ర క్షేమాన్ని ఆకాంక్షించే ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే అని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

ఈ సభను జనసేన ఆవిర్భావ దినోత్సవంగా చూడడం లేదని ఏపీ భవిష్యత్తు కోసం జనసేన దిశానిర్ధేశం చేయబోతోందన్నారు. వైసీపీ రెండున్నరేళ్ల పాలనలో ఏమేమీ జరిగాయి? ప్రజలు ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారు? భవిష్యత్తు ఎలా ఉండబోతోందన్న అంశాలపై సభలో పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇవ్వనున్నారు.

Also Read: Early Elections In Telangana: తెలంగాణలో ఎన్నికల సంగ్రామం షురూ కానుందా?

9వ పార్టీ పండుగపై కార్యకర్తలు నేతల్లో బోలెడు ఆశలున్నాయి. వచ్చే ఎన్నికలకు జనసేన ఒంటరిగా వెళుతుందా? లేక బీజేపీ, టీడీపీలతో పొత్తుతో వెళుతుందా? అన్నది ఈ సభతో తేలనుంది. పార్టీ శ్రేణులు, రాష్ట్ర ప్రజలకు పవన్ కళ్యాణ్ ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారన్నది ఇందులో కీలకం.. ఈ క్రమంలోనే ఏపీ రాజకీయాల్లో ఈరోజు నిర్వహించే జనసేన ఆవిర్భావ సభపై ప్రజలే కాదు.. ప్రతిపక్షాలు చాలా ఆసక్తితో ఉన్నాయి. వైసీపీ, టీడీపీ, బీజేపీ సైతం పవన్ చేసే ప్రకటనపైనే ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఏం జరుగుతుందన్నది ఈరోజు సాయంత్రం వేచిచూడాలి.