Pawan Kalyan: వైసీపీ మళ్లీ అధికారంలోకి రాదు: పవన్ సంచలన వ్యాఖ్యలు

Pawan Kalyan: ఏపీలో వైసీపీ మళ్లీ అధికారంలోకి రాదని జనసేనాని పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మళ్లీ రాని ప్రభుత్వం కోసం అధికారులు తాపత్రయపడొద్దని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని 25 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిన ఆ పార్టీకి ఓటు అడిగే హక్కు లేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో పవన్ కళ్యాణ్ అధికార వైసీపీ పాలనపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లపై చాలా ఆలోచించే మాట్లాడానని […]

Written By: NARESH, Updated On : April 5, 2022 10:40 pm
Follow us on

Pawan Kalyan: ఏపీలో వైసీపీ మళ్లీ అధికారంలోకి రాదని జనసేనాని పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మళ్లీ రాని ప్రభుత్వం కోసం అధికారులు తాపత్రయపడొద్దని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని 25 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిన ఆ పార్టీకి ఓటు అడిగే హక్కు లేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో పవన్ కళ్యాణ్ అధికార వైసీపీ పాలనపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లపై చాలా ఆలోచించే మాట్లాడానని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ అరాచకం, దోపిడీ వల్లే అలా అన్నానని.. రాష్ట్రాన్ని శ్రీలంకలా మారుస్తున్నందు వల్లే అలా మాట్లాడానని చెప్పుకొచ్చారు. వ్యతిరేక ఓటు చీలనివ్వబోనని రాజకీయ వ్యూహం కోసం అనలేదన్నారు.

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటే వైసీపీకి ఎందుకంత భయం అని పవన్ ప్రశ్నించారు. వైసీపీ పాలన వైఫల్యాలను ఒక్కొక్కటిగా చెబుతూ పవన్ ఎండగట్టారు. చెత్తపన్ను నుంచి కరెంట్ చార్జీల వరకూ అన్నీ పెంచారని. వేలాది మంది కౌలురైతులు చనిపోయే పరిస్థితి తీసుకొచ్చారన్నారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు స్కాలర్ షిప్ లు రద్దు చేశారని విమర్శించారు.

మొన్న సినిమా ద్వారా వచ్చిన డబ్బులో రూ.5 కోట్లు తీసుకొచ్చా.. మన వంతు ఎంతో కొంత సాయం చేయాలి. గొప్ప గొప్ప చదువులు చదువుకున్న జాతీయ స్తాయి నాయకులు సొంత ఆస్తులు ఇచ్చేశారు. వైసీపీ నేతల ధ్యాసంతా డబ్బు తీసుకోవడంపైనే ఉంది. ఇవ్వడం లేదని పవన్ తీవ్ర విమర్శలు చేశారు.

ఈనెల 12 నుంచి చనిపోయిన రైతులకు ఆర్థిక సాయం అందజేస్తానని.. అనంతపురం నుంచి ఈ కార్యక్రమం ప్రారంభిస్తామని పవన్ తెలిపారు. దీన్ని ‘జనసేన రైతు భరోసా యాత్ర’గా నామకరణం చేశామని తెలిపారు.

ఉత్తరాంధ్రపై ప్రత్యేక దృష్టి సారిస్తానని.. వైసీపీ వ్యూహాలను ధీటుగా ఎదుర్కొంటామని పవన్ తెలిపారు. పార్టీని బలోపేతం చేసి పొత్తులతో ముందుకెళుతామని పవన్ సంచలన ప్రకటన చేశారు.