ప్రతీ అంశాన్ని సపోర్ట్ చేసేవారు ఉంటారు.. వ్యతిరేకించే వారు ఉంటారు. ఆ అంశం రాజకీయాలకు సంబంధించినది అయితే.. ఇక చెప్పక్కర్లేదు. ఓడిపోయిన పార్టీలు నిత్యం ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే పనిలోనే ఉంటాయి. మసిపూసి మారేడు కాయ అని నమ్మించేందుకు ప్రయత్నిస్తుంటాయి. జనసేన్ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా ఇప్పుడు ఇదే చేస్తున్నారు. ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వట్లేదు.. నిరుద్యోగుల బాధలను పట్టించుకోవట్లేదు అని బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారు.
Also Read: వైఎస్ కు దోస్తులు.. జగన్ కు శత్రువులు..!
నాలుగున్నర లక్షల మందికి..
నిజానికి వైసీపీ ప్రభుత్వం వచ్చీ రాగానే లక్షన్నరమంది నిరుద్యోగులకు సచివాలయాల్లో ఉద్యోగాలిచ్చింది. ఆ తర్వాత మరో 3 లక్షల మందికి వలంటీర్ పోస్టులు వచ్చాయి. ఇవన్నీ గుర్తించకుండా.. ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్నారు జనసేనాని. ఏటా జనవరిలో ఉద్యోగాలు భర్తీ చేస్తామని, ఇంతవరకు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు పవన్. రాష్ట్రంలో సచివాలయాల ఏర్పాటుతో ఇతర శాఖల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కాస్త ఆలస్యమైంది. ఇది తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా సర్కారుపై నిందలు వేసే ప్రయత్నం చేశారు.
టీడీపీని ఒక్క మాటా అనలేదు..
కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వేయకుండా ఐదేళ్లు నెట్టుకొచ్చింది టీడీపీ ప్రభుత్వం. ఉద్యోగాలివ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పి.. నాలుగున్నరేళ్ళు అధికారం అనుభవించిన తర్వాత చివరి 3 నెలలు విదిల్చింది. అయినా.. కూడా పవన్ ఏనాడూ చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు. ఇప్పుడు ఉద్యోగాలు కల్పిస్తున్న వైసీపీ సర్కారును విమర్శిస్తున్నారు.
Also Read: పోలవరం బడ్జెట్లో కేంద్రం వాటా తేలేనా?
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు సంబంధించిన కొంతమంది సమస్యను, అందరికి సంబంధించిన సమస్యలాగా పవన్ మాట్లాడటం విడ్డూరం. తనను కలిసి ఇచ్చినవారు ఇచ్చిన సమాచారమే పవన్ దగ్గర ఉంది. అంతకు మించి ఆయనకు తెలియదు, తెలుసుకోవాలనే ప్రయత్నమూ చేయలేదు. ఏలూరు ఘటనలో ప్రభుత్వాన్ని నిందించడం కుదరకపోయేసరికి, వెంటనే ఏపీపీఎస్సీ వ్యవహారాన్ని తలకెత్తుకున్నారు జనసేనాని. నిరుద్యోగుల బాధనంతా తన బాధగా చెబుతున్న పవన్.. జగన్ హయాంలో ఉద్యోగాలు పొందిన లక్షల మంది సంతోషాన్ని ఎప్పటికి చూస్తారో..?!
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్