
Pawan Kalyan praises YCP : రాజకీయాలకు బిన్నంగా ప్రత్యర్థులు చేసే మంచి పనులను స్వాగతించే మనసున్నోడే నిజమైన నాయకుడు.ప్రస్తుతం అలాంటి లక్షణాలు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి తప్ప ఎవరికీ లేవు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని గా వైజాగ్ ని గత కొంత కాలం క్రితమే ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే.ఇప్పుడు ఈ ప్రాంతానికి ప్రపంచం నలుమూలల ఉన్న ప్రముఖ పారిశ్రామిక వేత్తలు మరియు MNC కంపెనీలు సమ్మిట్ ద్వారా సమావేశం అవ్వబోతున్నారు.
ఈ సమ్మిట్ గురించి విచారించిన పవన్ కళ్యాణ్ అది నిజమే అని అర్థం చేసుకొని వైసీపీ పార్టీ కి కృతఙ్ఞతలు తెలియచేస్తూ ఒక వ్యాసం ట్విట్టర్ లో వ్రాసాడు.ఇది చదివిన ప్రతీ ఒక్కరు లీడర్ అంటే ఇలా ఉండాలి, రాష్ట్ర శ్రేయస్సు కోరుకునే మనుషులు ఇలాగే ప్రవర్తిస్తారు అంటూ పవన్ కళ్యాణ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.వైసీపీ పార్టీ నాయకులు కూడా పవన్ వ్యవహరించిన తీరుని స్వాగతించారు.
ఇంతకీ ఆ ట్వీట్ లో పవన్ కళ్యాణ్ ఏమి వేశాడో ఒకసారి పరిశీలిస్తే ‘దేశవిదేశాల నుంచి ప్రకృతి అందాలతో అలరారే విశాఖ నగరానికి వస్తున్న పెట్టుబడిదారులందరికీ జనసేన స్వాగతం పలుకుతోంది. మా శక్తివంతమైన, అనుభవం కలిగిన ఆంధ్రప్రదేశ్ యువత మిమ్మల్ని మెప్పిస్తారని భావిస్తున్నాను.ఈ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి మంచి భవిష్యత్తు మన యువతకు ఉపాధిని అందించే అవకాశం కల్పించడంతోపాటు ఇన్వెస్టర్లు కూడా తమ పెట్టుబడులకు తగిన ప్రతిఫలం పొందుతారని ఆశిస్తున్నాను..ఏపీలో ఆర్థికవృద్ధికి ఉన్న అవకాశాలు, శక్తివంతమైన మానవ వనరులు, ఖనిజ సంపద, సముద్రతీరం వంటి వాటిని ఇన్వెస్టర్లకు సవివరంగా వివరించండి.రివర్స్ టెండరింగ్, మధ్యవర్తుల కమీషన్లు వంటి అడ్డంకులు ఏవీ లేకుండా పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని కలిగించండి!.ఈ సమ్మిట్ ఆలోచనలను కేవలం వైజాగ్‌కే పరిమితం చేయకండి. తిరుపతి, అమరావతి, అనంతపురం, కాకినాడ, శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరు, కడప.. ఆంధ్రప్రదేశ్ లోని ఇతర ప్రాంతాలలో ఉన్న అభివృద్ధి అవకాశాలను కూడా ఇన్వెస్టర్లకు వివరించండి.దీన్ని కేవలం ఒక నగరానికే పరిమితం చేయకుండా ఏపీ మొత్తానికి నిజమైన ఇన్వెస్టర్ల సమ్మిట్ లాగా మార్చండి.
ఇక చివరిగా- రానున్న రెండు రోజుల్లో ప్రభుత్వంపై జనసేన ఎలాంటి విమర్శలకు చోటివ్వదు. ఇన్వెస్టర్ల సమ్మిట్ విషయంలో ప్రభుత్వం ఎటువంటి రాజకీయ విమర్శలు చేయం. పెట్టుబడుల ఆకర్షణ అంశంలో ప్రభుత్వానికి సంపూర్ధ మద్దతును అందిస్తోంది.ఇన్వెస్టర్ల సమ్మిట్ సందర్భంగా ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియచేస్తోంది. రాజకీయం కంటే రాష్ట్రం మిన్న’ అంటూ పవన్ కళ్యాణ్ వేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా లో చర్చనీయాంశం గా మారింది.
4 )
ఇక చివరిగా- రానున్న రెండు రోజుల్లో ప్రభుత్వంపై జనసేన ఎలాంటి విమర్శలకు చోటివ్వదు. ఇన్వెస్టర్ల సమ్మిట్ విషయంలో ప్రభుత్వం ఎటువంటి రాజకీయ విమర్శలు చేయం. పెట్టుబడుల ఆకర్షణ అంశంలో ప్రభుత్వానికి సంపూర్ధ మద్దతును అందిస్తోంది.(cont..)
— Pawan Kalyan (@PawanKalyan) March 2, 2023