
Ram Charan Indian Movies : ప్రపంచ సినిమా వేదికపై రామ్ చరణ్ సత్తా చాటుతున్నారు. పలు అంతర్జాతీయ వేదికలపై ఆయన ఇండియన్ సినిమా ఔన్నత్యం చాటుతున్నారు. రామ్ చరణ్ అసలు సిసలైన భారతీయ సినిమా ప్రతినిధిగా నిరూపించుకుంటున్నారు. అమెరికాలో ఓ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ చరణ్ గ్లోబల్ ఆడియన్స్ కి నాలుగు సినిమాలు తప్పక చూడాలని సూచించారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ తెరకెక్కించిన ఈ నాలుగు చిత్రాలు మీకు గొప్ప అనుభూతిని పంచుతాయని చెప్పారు.
రామ్ చరణ్ అభిప్రాయంలో ఆ నాలుగు చిత్రాలు ఏమిటనగా… దర్శకుడు రాజమౌళి విజువల్ వండర్ బాహుబలి. అలాగే సీనియర్ ఎన్టీఆర్ కెరీర్లో మైలురాయిగా నిలిచిన దాన వీర శూర కర్ణ చిత్రం తప్పక చూడాలన్నారు. ఇక బాలీవుడ్ నుండి ఆయన మిస్టర్ ఇండియా ఎంపిక చేశారు. దర్శకుడు శేఖర్ కపూర్ తెరకెక్కించిన మిస్టర్ ఇండియా ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని పంచే చిత్రంగా తన జాబితాలో ఎంపిక చేశారు. చివరిగా ఆయన తన చిత్రాన్ని రికమెండ్ చేశారు. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం మూవీ చూడదగ్గ చిత్రమని వెల్లడించారు.
నాలుగు భిన్నమైన జానర్స్ కి చెందిన చిత్రాలను ప్రేక్షకులకు రామ్ చరణ్ సూచించారు. ఇండియన్ సినిమా హిస్టరీలో అనేక గొప్ప చిత్రాలు ఉన్నాయి. నేను కొన్ని మచ్చుకకు చెప్పానన్నారు. ఇక అమెరికాలో రామ్ చరణ్ ఫేమ్ చూసిన భారతీయ సినిమా వర్గాలు విస్తుపోతున్నాయి. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఆయన ఫేమ్ ఏ స్థాయికి చేరిందో ప్రత్యేకంగా చూసి విస్మయానికి గురవుతున్నారు. హాలీవుడ్ ప్రముఖులు, అమెరికన్ మీడియా రామ్ చరణ్ ని ప్రత్యేకంగా చూస్తుంది.
రామ్ చరణ్ గుడ్ మార్నింగ్ అమెరికా షోలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ ఘనత అందుకున్న మొట్టమొదటి ఇండియన్ హీరోగా చరిత్ర సృష్టించారు. ఈ షోలో రామ్ చరణ్ మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు స్పందించిన తీరు అద్భుతం. కేవలం భారతీయ సినిమా మీదే కాకుండా వరల్డ్ సినిమా గురించి ఆయన మంచి నాలెడ్జ్ ఉందన్న విషయం రుజువైంది. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ రామ్ చరణ్ విశిష్ట అతిధిగా ఆహ్వానించింది. స్పాట్ లైట్ అవార్డుతో సత్కరించారు. మార్చి 12న జరుగనున్న ఆస్కార్ వేడుకలో సైతం రామ్ చరణ్ ప్రత్యేకంగా ఆకర్షణగా నిలవనున్నారు.