
Pawan Kalyan: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నేడు జనసేన పార్టీ పెట్టి పది సంవత్సరాలు పూర్తి అయినా సందర్భంగా మచిలీపట్టణం లో ‘దిగ్విజయ భేరి’ పేరు తో ఒక మహా సభని ఏర్పాటు చేసాడు.జనసేన పార్టీ కార్యకర్తలు మరియు అభిమానులు ఈ సభని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు..రాష్ట్రము నలుమూలల నుండి లక్షలాదిగా సభకి తరళి వస్తూనే ఉన్నారు.

విజయవాడ నుండి మచిలీపట్టణం కి సుమారుగా 80 కిలోమీటర్ల దూరం ఉంటుంది, పవన్ కళ్యాణ్ అడుగడుగునా నీరాజనం పలుకుతున్న అభిమానులకు అభివాదం చేస్తూ పది కిలోమీటర్లు రావడానికి మూడు గంటల సమయం పట్టింది.దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు, జనాలు ఏ స్థాయిలో నీరాజనం పలికారో అని చెప్పడానికి.అయితే మార్గ మద్యం లో అశేష జనవాహిని కారణంగా ఒక అంబులెన్సు ట్రాఫిక్ లో ఇరుక్కుంది.దీనిపై నీచమైన రాజకీయాలు చెయ్యడానికి మన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తన నీలి మీడియా లో చాలా ప్రయత్నాలే చేసింది.
ఇక అసలు విషయానికి వస్తే వేలాది మంది అభిమానుల మధ్యలో ముందుకు సాగుతున్న మార్గమధ్యంలో పెనమలూరు నియోజకవర్గం, ఈడ్పుగల్లు వద్ద అత్యవసర సర్వీసు అయిన అంబులెన్స్ వాహనాల మధ్య ఇరుక్కుపోవడంతో.వారాహిని పది నిమిషాలు నిలిపివేసి ఆంబులెన్స్ కి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దారిచ్చారు. అంబులెన్స్ ముందుకు వెళ్లిపోయిన తర్వాత వారాహి యాత్ర కొనసాగింది. మానవతావాదిగా శ్రీ పవన్ కళ్యాణ్ మరోసారి రుజువు చేసుకున్నారు.అంత జనాభా మధ్యలో కూడా పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి ప్రాణం ని పరిగణలోకి తీసుకొని ఆయన చేసిన ఈ గొప్ప పనికీ సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది.