Pawan Kalyan Modi : ప్రధాని మోడీని కలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ అన్న మాట వైరల్ అయ్యింది.. ‘త్వరలో ఏపీకి మంచిరోజులు వస్తున్నాయి’ అన్న పవన్ డైలాగ్ ప్రత్యర్థులకు హెచ్చరికగా మారింది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల వెనుక అర్థం ఏంటన్న దానిపై ఆరాలు తీస్తున్నారు. ఇది అధికార వైసీపీకి హెచ్చరికనే అని అంటున్నారు.

ఏపీలో జనసేనాని పవన్ కళ్యాణ్ ను అడుగడుగునా అడ్డుకుంటోంది వైసీపీ ప్రభుత్వం. విశాఖలో, ఇప్పటంలో తొక్కిపడేసింది. వారికి వ్యతిరేకంగా పవన్ అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మోడీ విశాఖ రాక సందర్భంగా పవన్ కు ఆహ్వానం అందడం.. ఆయన వెళ్లి 40 నిమిషాలు కలిసి రహస్య చర్చలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ భేటీలో ఏం మాట్లాడారన్న దానిపై ఎలాంటి వార్తలు బయటకు పొక్కలేదు. పవన్ కళ్యాణ్ సైతం ఆ రహస్యాన్ని బయటపెట్టలేదు. కేవలం ‘త్వరలోనే ఏపీకి మంచి రోజులు వస్తున్నాయి’ అని మాత్రమే అన్నారు.
వైసీపీ అవినీతి, అక్రమాలు, అనైతిక పాలనపై పవన్ కళ్యాణ్ అలుపెరగని పోరాటం చేస్తున్నారు. వైసీపీ దమనకాండకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఏపీ ప్రజలు కూడా వైసీపీ పాలనతో ఇప్పటం సహా రాష్ట్ర వ్యాప్తంగా బాధపడుతున్నారు. అందుకే పవన్ అన్న వ్యాఖ్యలు ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వానికి హెచ్చరిక లాంటిదని.. మోడీ ఏదో బలమైన హామీ ఇవ్వడం బట్టే పవన్ అలా అని ఉంటాడని తెలుస్తోంది. పవన్ వ్యాఖ్యల వెనుక మోడీ భరోసా ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.