Case against Janasena leader Pawan Kalyan : మోడీతో భేటి వల్ల పవన్ కల్యాణ్ కు అంత ప్రాధాన్యత దక్కడాన్ని వైసీపీ సహించలేకపోతోంది. తాము ఎంత అణిచివేసినా ఆధిపత్యం చెలాయిస్తున్న పవన్ పై ఎలాగైనా సరే పగ తీర్చుకోవాలని చూస్తోంది. అందుకే తాజాగా ముగిసిపోయిన వాటిని వెలికి తీసి మరీ కేసులు నమోదు చేస్తోంది. పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు చేసి మరో సంచలనానికి తెరతీసింది.
జనసేనాని పవన్ కల్యాణ్ పై ఏపీ ప్రభుత్వం కేసు పెట్టడం సంచలనమైంది. తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో నిన్న కేసు నమోదు చేసిన పోలీసులు ర్యాష్ డ్రైవింగ్ కింద పవన్ ను అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఐపిసిలోని 336 , 279 , రెడ్ విత్ 177 ఎంవీ యాక్ట్ క్రింద కేసు నమోదు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇప్పటం గ్రామం వెళ్లే సమయంలో కారు పై కూర్చొని పవన్ వెళ్లడాన్ని బూచీగా డ్రైవర్ రాష్ డ్రైవింగ్ పై కేసులు నమోదు చేశారు. జాతీయ రహదారి పై ఆయన వాహన శ్రేణిని పలు వాహనాలు అనుసరించడం పై కూడా కేసు నమోదు చేసిన పోలీసులు
తెనాలి మారిస్ పేటకు చెందిన పి.శివ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పవన్ కళ్యాణ్ , డ్రైవర్ పై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసులో పవన్ కళ్యాణ్ , కారు డ్రైవర్ పై కూడా కేసు నమోదు చేయడం విశేషం. తెలంగాణా రిజిస్ట్రేషన్ నంబర్ తో ఉన్న కారుపై కూర్చొని పవన్ ప్రయాణించారు. అందుకే ఆ కారుపై కూడా ఛాలన్ వేశారు.
ఇతరులకు భద్రతకు ముప్పు కలిగించే విధంగా వ్యవహరించినందుకు ఐపిసిలోని 336 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. రహదారి పై నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపిన కారణంగా ఐపిసి లోని 279 సెక్షన్ కింద కేసు పెట్టారు.
నిజానికి పవన్ కళ్యాణ్ కారులో ప్రశాంతంగా కూర్చొని వెళ్లేవారే. కానీ ఆయనను మంగళగిరి కార్యాలయం నుంచి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కారు దిగి కాలినడకన వెళ్లడానికి రెడీ అయ్యారు. మధ్యలో కారు రావడంతో దానిపై ఎక్కి కూర్చున్నారు.పోలీసుల చర్యలతోనే అలా చేశారు. దీన్ని కూడా రాజకీయ కోణంలో చూసి కేసు పెట్టి వేధించడానికి జగన్ సర్కార్ రెడీ అయ్యింది. మోడీతో భేటి ద్వారా వచ్చిన క్రేజ్ ను పవన్ కు దక్కనీయకుండా చేసేందుకు ఈ కుట్ర పన్నుతున్నట్టు అర్థమవుతోంది.