Pawan Kalyan: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు ఏపీలో పెద్ద దుమారాన్నే రేపుతోంది. అసలు జగన్ సర్కారు ఇలా ఎందుకు ప్రవర్తిస్తుందో తెలియడం లేదని సామాన్యులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రధాన విపక్షం టీడీపీ అగ్గిమీద గుగ్గిలమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతోంది. అటు ఎన్టీఆర్ కుటుంబం కూడా దీనిపై స్పందించింది. ప్రభుత్వ తీరును ఖండించింది. ఒక్క జూనియర్ ఎన్టీఆర్ మాత్రం దీనిపై ఇంతవరకూ ఎటువంంటి ప్రకటన చేయలేదు. కానీ జనసేన అధినేత మాత్రం స్పందించారు. చాలా లోతుగా మాట్లాడారు. ప్రజల ఆలోచనలకు దగ్గరగా వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ పేరు మార్చి ఏం సాధిస్తారని ప్రశ్నించారు. పేరు మార్చితే మౌలిక వసతులు మెరుగుపడతాయా అంటూ షటైర్లు వేశారు. మౌలిక వసతులను మెరుగుపరచడం వదిలి ఇలా పేర్లు మార్పుతో పాలన సాగిస్తామంటే ఎలా అని ప్రశ్నించారు. వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఎందరో యోధులు ఉండగా.. వారందర్నీ మరిచి ఇంటి వ్యక్తుల పేర్లు పెట్టుకుంటారా? అని సీఎం జగన్ ను సూటిగా ప్రశ్నించారు.

ఇప్పటివరకూ ఏ రాజకీయ పార్టీ నాయకుడికి తెలియని వైద్య మహనీయుల పేర్లను పవన్ ప్రస్తావించారు. బోదకాలు, టైఫాయిడ్ వంటి ప్రాణాంతక వ్యాధులకు మందులు కనిపెట్టిన యల్లాప్రగడ సుబ్బారావు పేరును ఒక్క వైద్య సంస్థకైనా పెట్టారా అంటూ నిలదీశారు.ప్రజల ఆస్తులకు తన సొంత వారి పేర్లు పెట్టే ముందు అటువంటి మహనీయుల చరిత్ర తెలుసుకోవాలని కూడా సీఎం జగన్ కు సూచించారు. అధికారం మారినప్పుడల్లా ఇలా పేర్లు మార్చుకుంటూ పోతే ప్రజలకు ఒరిగేదేమీ ఉండదన్న విషయం పాలకులు తెలుసుకోవాలన్నారు.
Also Read: EC- Jagan: అది ఎన్నికల నియమావళికి విరుద్ధం.. వైసీపీ శాశ్వత అధ్యక్షుడు జగన్ కు ఈసీ షాక్
మీకు పేరు మార్చాలని అనిపించినప్పుడు విశాఖ కింగ్ జార్జి ఆస్పత్రి పేరు మార్చుకోవచ్చు కదా అని ప్రభుత్వానికి పవన్ సలహా ఇచ్చారు. ఇంకా బ్రిటీష్ వాసనలతో ఉన్న ఒక వైద్య ఆస్పత్రి ఉందన్న విషయం మరిచారా? లేకుంటే మీకు అవగాహన లేదా అని కూడా ప్రశ్నించారు. ఆజాదీ కా అమృత్ దినోత్సవ వేళ ఇంకా బ్రిటీష్ పాలకుల పేర్లతో నడుస్తున్న సంస్థలను పరిగణలోకి తీసుకోండి అంటూ సూచించారు. 75 సంవత్సరాల స్వాతంత్ర్యం పూర్తిచేసుకున్న వేళ వైద్యరంగంలో విశేష సేవలందించిన స్వదేశీయులు, సొంత రాష్ట్రం ప్రముఖుల పేర్లు మీకు గుర్తుకు రావడం లేదా? అని పవన్ ప్రశ్నించారు.

ఎటువంటి రాజకీయ వ్యాఖ్యానాలు చేయకుండా, బాధ్యతాయుతంగా లెవనెత్తిన అంశాలు రాష్ట్ర ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అటు సోషల్ మీడియాలో కూడా పవన్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ప్రజల మైండ్ సెట్ ను పక్కదారి పట్టించేందుకే ఇటువంటి ఘటనలకు పాల్పడితే మాత్రం ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అయితే హెల్త్ యూనివర్సిటీ ఇష్యూలో పవన్ గట్టిగానే నిలదీయడంతో అటు టీడీపీ శ్రేణులు సైతం పవన్ ను అభినందనలతో ముంచెత్తుతున్నాయి.
Also Read: AP BJP: పొత్తు జనసేనతో..ఉండేది వైసీపీతో.. ఏపీలో బీజేపీ డబుల్ గేమ్
[…] […]
[…] […]
[…] […]