Pawan Kalyan : పవన్ కళ్యాణ్ అభిమానులు మరియు జనసేన పార్టీ కార్యకర్తలు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన వారాహి యాత్ర , నేడు పత్తిపాడు సభతో ఘనంగా ప్రారంభం అయ్యింది. ఈ యాత్రలో పవన్ కళ్యాణ్ కి జనాలు అడుగడుగునా నీరాజనాలు పలికారు. అభిమానులు మరియు కార్యకర్తలు వేలాదిగా తరళి వస్తారు అని ముందుగానే భారీ బందోబస్తు ని ఏర్పాటు చేసారు.
కానీ అనుకున్న దానికంటే ఎక్కువ మంది రావడం తో కంట్రోల్ చెయ్యడానికి పోలీసులు అదుపు చేయలేకపోయారు. ఒక అభిమాని ఆ జనసందోహం లో కరెంటు ట్రాన్స్ ఫార్మర్ మీద పడి చనిపోయాడు అని వార్తలు వచ్చాయి.అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ప్రమాదం జరిగిన విషయం వాస్తవమే కానీ, నా ప్రాణాలకు ఎలాంటి హాని జరగలేదని, మీడియా వస్తున్నా వార్తలు తప్పు అని ప్రమాదానికి గురైన అభిమాని చెప్పుకొచ్చాడు.
ఈ ప్రసంగం లో పవన్ కళ్యాణ్ వైసీపీ చేసిన దారుణాలను , ఇచ్చిన మాటలను ఏ విధంగా తప్పిందో ప్రతి పాలసీ ని వివరిస్తూ జనాలకు తెలియచేసిన విధానం అందరికీ ఎంతగానో నచ్చింది. ముఖ్యంగా మద్యపాన నిషేధం పై ఆయన చేసిన వ్యాఖ్యలు అందరిని ఎంతో ఆకట్టుకుంది. ‘మద్యపానం సంపూర్ణంగా నిషేధించలేమని ఆరోజే చెప్పాను, కానీ ముఖ్యమంత్రి మధ్య పాన నిషేధం అన్నాడు, చివరికి ఏమైంది?, అదే మద్యం తో వ్యాపారం చేస్తూ 16 వేల కోట్ల రూపాయిలు సంపాదించాడు.
CPS రద్దు అన్నాడు ఏమైంది?,విద్యుత్ చార్జీలు తగ్గిస్తాము అన్నాడు, ఇప్పుడు ఎంత కరెంటు బిల్లు వస్తుందో ప్రతీ ఒక్కరు చూస్తూనే ఉన్నారు’ అంటూ పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వైఫల్యాలను ఎట్టి చూపిస్తూ ఇచ్చిన ప్రసంగం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో అలజడి రేపింది.మరి దీనికి వైసీపీ నాయకులూ ఎలాంటి కౌంటర్ ఇస్తారో చూడాలి.