
Pawan Kalyan : అశేష జనవాహిన నడుమ పవన్ కల్యాణ్ మంగళగిరిలోని పార్టీ ఆవిర్భావ సభకు బయల్దేరారు. వారాహి వాహనంపై నుంచి విజయవాడ నుంచి అభివాదం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా పవన్ కల్యాణ్ కు ప్రమాదం సంభవించేది. ఏం జరిగిందంటే..
నోవాటెల్ హోటల్ నుంచి ర్యాలీగా బయల్దేరిన పవన్ కల్యాణ్ విజయవాడకు చేరుకున్నారు. విజయవాడ అంతా జనసంద్రంలా మారిపోయింది. ప్రజలకు అభివాదం చేస్తూనే జనసేనాని ముందుకు కదిలారు. విజయవాడలో వారాహి వాహనంపై ఎక్కి మచిలీపట్నం బయల్దేరారు. విజయవాడ నుంచి సభా ప్రాంగణం సుమారు 50 కిలో మీటర్ల వరకు ఉంటుంది.

మార్గ మధ్యలో జనసేన నాయకులు రంగా అభిమాన సంఘం ఆధ్వర్యంలో భారీ క్రేన్లతో భారీ పూలదండలను సిద్ధం చేశారు. దారిపొడవునా పూల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. వారాహి వాహనంపై ఉన్న పవన్ కల్యాణ్‌కు కరెంటు వైర్లు అడ్డుగా వచ్చాయి. భారీ ర్యాలీ జరుగుతుందని తెలిసి కూడా అధికారులు వాటిని కనీసం తొలగించలేదు. వాటిని గమనించిన పవన్ వెంటనే ప్రజలకు అభివాదం చేస్తూనే ముందుకు వంగారు. ఇది గమనించిన బౌన్సర్లు వెంటనే వారాహి వాహనం పైకి ఎక్కి వైర్లు ఆయనకు తగలకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై జనసైనికులు మండిపడుతున్నారు.
మచిలీపట్నం వరకు జనసేన కార్యకర్తలు పవన్ కల్యాణ్ వెంట వస్తూనే ఉన్నారు. ఆయనను చూసేందుకు దారి పొడవునా డాబాలపైనా పెద్ద సంఖ్యలో ప్రజలు వేసి చేశారు. మచిలీపట్నం సభకు చేరుకున్న అనంతరం పవన్ ప్రసగించనున్నారు. ఆయన భవిష్యత్తు కార్యాచరణపై ఏం మాట్టాడుతారన్నదే ప్రస్తుతం ఆసక్తిగా మారింది.