https://oktelugu.com/

Pawan Kalyan: వైసీపీ వ్యతిరేక ఓటు చీల్చను.. పొత్తులపై పవన్ సంచలన ప్రకటన

Pawan Kalyan: ఏపీ భవిష్యత్ కోసం పొత్తులు పెట్టుకుంటానని.. వైసీపీ వ్యతిరేక ఓట్లు చీల్చను అంటూ పవన్ కళ్యాన్ సంచలన ప్రకటన చేశారు. బీజేపీతో కలిసి వెళుతున్నామని.. వైసీపీ గెలవకూడదంటే ఎవరితోనైనా కలుస్తామని ఏపీ రాజకీయాలను షేక్ చేసే ప్రకటన చేశారు. పరోక్షంగా వైసీపీని ఓడించడానికి ఏపార్టీతోనైనా కలుస్తానని.. టీడీపీ శ్రేణుల్లోనూ ఉత్సాహం నింపారు. పవన్ చేసిన ఈ ప్రకటన ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. జనసేన ఆవిర్భావ సభ వేదికగా పవన్ కళ్యాణ్ సంచలన […]

Written By:
  • NARESH
  • , Updated On : March 14, 2022 / 08:44 PM IST
    Follow us on

    Pawan Kalyan: ఏపీ భవిష్యత్ కోసం పొత్తులు పెట్టుకుంటానని.. వైసీపీ వ్యతిరేక ఓట్లు చీల్చను అంటూ పవన్ కళ్యాన్ సంచలన ప్రకటన చేశారు. బీజేపీతో కలిసి వెళుతున్నామని.. వైసీపీ గెలవకూడదంటే ఎవరితోనైనా కలుస్తామని ఏపీ రాజకీయాలను షేక్ చేసే ప్రకటన చేశారు. పరోక్షంగా వైసీపీని ఓడించడానికి ఏపార్టీతోనైనా కలుస్తానని.. టీడీపీ శ్రేణుల్లోనూ ఉత్సాహం నింపారు. పవన్ చేసిన ఈ ప్రకటన ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

    Pawan Kalyan

    జనసేన ఆవిర్భావ సభ వేదికగా పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు. వైసీపీని కడిగిపారేశారు. ఏపీ భవిష్యత్ కోసం అవసరమైతే ఎవరితైనా కలుస్తానని పవన్ చేసిన ప్రకటన ఇప్పుడు రాజకీయ సంచలనంగా మారింది. ఇది ప్రతిపక్ష టీడీపీకి గొప్ప ఊపిరినిచ్చినట్టైంది.

    Also Read: Janasena Formation Day LIVE: జనసేన 9వ ఆవిర్భావ సభ: పవన్ కళ్యాణ్ స్పీచ్ లైవ్

    ఈ సందర్భంగా రెండున్నరేళ్ల వైసీపీ పాలనపై పవన్ హాట్ కామెంట్స్ చేశారు. ఒక్క చాన్స్ ఇస్తే ఆంధ్రాను పాతికేళ్లు వెనక్కి తీసుకెళ్లారని వైసీపీపై పవన్ నిప్పులు చెరిగారు. వైసీపీ ప్రతిజ్ఞ పేరిట పవన్ చేసిన పేరడి పదాలు వైరల్ అయ్యాయి. అశుభంతో వైసీపీ పాలన ప్రారంభమైందని ఆరోపించారు. తాను రెండు చోట్ల ఓడిపోయిన కూర్చున్నానని.. వైసీపీ గెలిచిందని తొడలు కొడుతున్నారని.. అయితే అది చూసి తనకు నవ్వొస్తోందని పవన్ అన్నారు. ఉత్సాహానికి తొడ కొట్టుకుంటే కొట్టుకోనని.. కందిపోతే మనకేం నష్టం లేదన్నారు.

    వైసీపీ వ్యతిరేక శక్తులను ఏకం చేస్తాం.. ఏపీ బాగు కోసం బీజేపీ తోపాటు కలిసి వచ్చే వారితో వెళతామని పవన్ ప్రకటించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తులకు రెడీ అని ప్రకటించారు.

    అధికార బలంతో ఒళ్లు బలిసి కొట్టుకుంటున్న వైసీపీ నేతలు.. కొమ్ములు ఇరగ్గొట్టి కింద కూర్చోబెట్టి.. వచ్చే ఎన్నికల్లో సరికొత్త ప్రజాప్రభుత్వాన్ని స్థాపిస్తాం..అని జనసేన 9వ ఆవిర్భావ సభ లక్ష్యం ఉద్దేశం అని పవన్ సంచలన ప్రకటన చేశారు.

    Also Read: Pawan Kalyan : ఒక్క చాన్స్ ఇస్తే ఆంధ్రాను పాతికేళ్లు వెనక్కి తీసుకెళ్లారు.. వైసీపీని కడిగేసిన పవన్