Pawan Kalyan :జనసేన ఆవిర్భావ సభకు తమ భూములు ఇచ్చిన ఇప్పటం గ్రామ ప్రజలకు రూ.50లక్షలు ప్రకటించి వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు పవన్ కళ్యాణ్. జనసేన 9వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అమరావతి పరిధిలోని మంగళగిరి ఇప్పటం గ్రామ బహిరంగ సభలో పవన్ మాట్లాడారు. వైసీపీ సర్కార్ ఇబ్బందులు పెట్టినా భూములు ఇచ్చి సభజరుపుకోవడానికి సహకరించిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్శంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాను రాజకీయాల్లోకి రావడానికి తన సోదరుడు నాగబాబు ఇచ్చిన ఒక పుస్తకమే కారణమని.. దాని స్ఫూర్తితోనే తానిప్పుడు రాజకీయాల్లోకి వచ్చానని.. ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు పవన్. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి తెలంగాణ నేతలు, ఇతర నేతలకు ధన్యవాదాలు తెలిపారు.ఇక తమను ఇబ్బంది పెడుతున్న వైసీపీ నేతలకు నమస్కారాలు పెట్టి తన సంస్కారాన్ని తెలియజేశారు.
2024లో అధికారమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు. అధికారం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుదామని.. ఆ దిశగా అడుగులు వేద్దామని పవన్ ప్రకటించారు. 2024లో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.
ఈ సందర్భంగా రెండున్నరేళ్ల వైసీపీ పాలనపై పవన్ హాట్ కామెంట్స్ చేశారు. తాను రెండు చోట్ల ఓడిపోయిన కూర్చున్నానని.. వైసీపీ గెలిచిందని తొడలు కొడుతున్నారని.. అయితే అది చూసి తనకు నవ్వొస్తోందని పవన్ అన్నారు. ఉత్సాహానికి తొడ కొట్టుకుంటే కొట్టుకోనని.. కందిపోతే మనకేం నష్టం లేదన్నారు.
వైసీపీపై పవన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిజ్ఞ రూపంలో వైసీపీ అరాచకన్ని కవిత రూపంలో వినిపించి తూర్పారపట్టారు. పెట్టుబడుల్లో 50శాతం వాటా లాక్కుంటామని.. అందరి ఆర్థిక మూలాలు దెబ్బతీస్తారని.. ఇసుకను నమిలేస్తాం.. సహజ వనరులను సాంతానికి వాడుకుంటారని.. దేవత విగ్రహాలను అపవిత్రం చేసిన వారిని గుండెల్లో పెట్టుకుంటారని.. కబ్జాలు, భూములు తాకట్టు పెడుతారని.. మద్యంతో తాగిస్తారు.. లాఠీలతో చిత్తకొట్టేస్తారంటూ పవన్ విమర్శించారు..
ఒక్క చాన్స్ ఇస్తే ఆంధ్రాను పాతికేళ్లు వెనక్కి తీసుకెళ్లారని వైసీపీపై పవన్ నిప్పులు చెరిగారు. వైసీపీ ప్రతిజ్ఞ పేరిట పవన్ చేసిన పేరడి పదాలు వైరల్ అయ్యాయి. అశుభంతో వైసీపీ పాలన ప్రారంభమైందని ఆరోపించారు.
గత చంద్రబాబు ప్రభుత్వం చేసిన మూడు పనులను వైసీపీ రాగానే క్యాన్సిల్ చేసిందని పవన్ ఆరోపించారు. అమరావతిని ఒప్పుకొని ప్రతిపక్షంలో జగన్ ఆమోదించారని.. అధికారంలోకి రాగానే అమరావతిని రద్దు చేసి మూడు రాజధానులు చేశారని మండిపడ్డారు.విద్యుత్ ఒప్పందాలు జగన్ వచ్చాక రద్దు చేశారని విమర్శించారు. రాజులు మారితే రాజధానులు మారవని హితవు పలికారు.
అమరావతి కోసం ప్రతిపక్షంలో ఒప్పుకున్న వైసీపీ నేతలు గాడిదలు కాశారా? ఇప్పుడెందుకు అడ్డుకుంటున్నారని పవన్ నిలదీశారు. మూడు రాజధానుల గురించి వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా ఒక్క మాట మాట్లాడలేదని.. అమరావతికి వెయ్యి ఎకరాలు ఎక్కువే కేటాయించాలని జగన్ అన్నారని దుయ్యబట్టారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతియేనని పవన్ సంచలన ప్రకటన చేశారు. అమరావతి ఇక్కడి నుంచి కదలదు. మిగతా ప్రాంతాలను వదిలేయమని పవన్ అన్నారు. అమరావతి వల్ల న్యాయవ్యవస్థను తప్పు పట్టే స్థితికి వైసీపీ దిగజారిందని పవన్ అన్నారు.
Also Read: Janasena Pawan: ‘జనసేనాని’ గేర్ మార్చాల్సిందేనా?
ముగ్గురు పోలీస్ అధికారులను కూడా వైసీపీ ప్రభుత్వం కోర్టు హాల్లో నిలబెట్టిందని పవన్ మండిపడ్డారు.
వెల్లంపల్లి.. వెల్లుల్లిపాయ వ్యక్తికి, అవంతి బంతి ఆయనకు అసలు మంత్రులయ్యే అర్హత ఉందా? వీళ్లు ఐఏఎస్, ఐపీఎస్ లను శాసిస్తారా? అంటూ పవన్ మండిపడ్డారు. పోలీసులను కొట్టిన వైసీపీ నేతలున్నారని.. పోలీసులు ఎదురు తిరిగితే వారిని వేకెన్సీ రిజర్వ్ లో వైసీపీ ప్రభుత్వం పెట్టి వారికి జీతాలు ఇవ్వకుండా ఏడిపిస్తున్నారని పవన్ పోలీసుల ఆవేదనను కళ్లకు కట్టారు.
—————————-
-పవన్ కళ్యాణ్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు
—————————-
-జనసైనికులను కొదమ సింహాలతో పోల్చిన పవన్ కళ్యాణ్
-నాగబాబు పుస్తకం తనను రాజకీయాల్లోకి వచ్చేలా చేసింది.. నాగబాబుకు రుణపడి ఉంటాను
-గెలిచినా ఓడినా నీవెంట అన్న నాదెండ్లకు కృతజ్ఞతలు
-రాజకీయాల్లో విభేదాలుండాలి.. వ్యక్తిగత ద్వేషాలు వద్దు
-పార్టీ నడపాలంటే సైద్ధాంతిక బలం ఉండాలి.
-నా సంస్కారం వైసీపీ నేతలకు కూడా నమస్కారం
-స్వాతంత్ర్యం, తెలంగాణ సాయుధ పోరటాం స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చాను..
-వైసీపీలో బూతులు తిట్టే మంత్రులే కాదు.. మంచి మంత్రులుననారు.
-వైసీపీ అంతా కాంగ్రెస్ నేతలే..
-జనసేనలో సీనియర్లు లేరు.. ప్రజలు, పవన్ కళ్యాణ్ యే..
-32మంది నిండు ప్రాణాలను వైసీపీ బలిగొంది
-వైసీపీ ప్రభుత్వం తమ పార్టీ రంగులు, ప్రకటనల కోసం 3వేల కోట్లు ఖర్చు పెట్టారు.
-‘అమెరోన్ బ్యాటరీని ఏపీ నుంచి తరిమికొట్టారని.. కియా పరిశ్రమను ఇబ్బందుల పాలు చేస్తున్నారు.
-మధ్యనిషేధం విధించి జగన్ 45 వేల కోట్లు సంపాదించిన ఘనత జగన్ సర్కార్ దే
-మద్యం ధరలు పెంచితే మద్యనిషేధం అమలవుతుందా? కల్తీ మద్యంతో జనాలు చనిపోతున్నారు
-మద్యం ఆదాయం 25వేల కోట్లు వైసీపీ జేబుల్లోకి వెళుతోంది.
-ప్రభుత్వం మద్యం షాపులు నడుపుతోంది. పాఠశాలలు నడిపించాలి.. ఉద్యోగాలివ్వాలి..
-జనసేన నాయకులపై దాడులు చేస్తే భీమ్లానాయక్ ట్రీట్ మెంట్ చేస్తాం
-కాపుల్లో ఐక్యత కోసం కృషి, శెట్టి బలిజలు, కాపులను ఏకం చేశానని పవన్ ప్రకటన
-బీజేపీతో కలిసి రోడ్ మ్యాప్ వేసి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించుతాం
-దోపిడీ చేసే వైసీపీ గుండాలకు వారి దోపిడీని అరికట్టే జనసేనసైనికులుంటారు
-తిరుపతిని భ్రష్టుపట్టించారని.. విగ్రహాలను ధ్వంసం చేస్తున్నా అరెస్ట్ లు చేయడం లేదు.
-వైసీపీ వ్యతిరేక శక్తులను ఏకం చేస్తాం.. ఏపీ బాగు కోసం బీజేపీ తోపాటు కలిసి వచ్చే వారితో వెళతాం..
-రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తులకు రెడీ..
-అధికార బలంతో ఒళ్లు బలిసి కొట్టుకుంటున్న వైసీపీ నేతలు.. కొమ్ములు ఇరగ్గొట్టి కింద కూర్చోబెట్టి.. వచ్చే ఎన్నికల్లో సరికొత్త ప్రజాప్రభుత్వాన్ని స్థాపిస్తాం..అని జనసేన 9వ ఆవిర్భావ సభ లక్ష్యం ఉద్దేశం అని పవన్ సంచలన ప్రకటన చేశారు.
-ఏపీ బాధ్యతను జనసేన పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నాడని.. ప్రకటన..
———————————————
-ఏపీ ప్రజలకు పవన్ కళ్యాణ్ హామీలు
———————————————-
-అప్పుల్లో ఉన్న ఆంధ్రాను అప్పులు లేని ఆంధ్రాగా మారుస్తానని పవన్ ప్రకటన..
-పారిశ్రామిక రంగానికి పెద్దపీట
-విశాఖ , తిరుపతి పెద్దనగరాలుగా తీర్చదిద్దుతాను
-కర్నూలుకు దామోదరం సంజీవయ్య పేరు
-పేదలకు ఇళ్ల నిర్మాణం , ఉచిత ఇసుక
– ఐదు సంవత్సరాల్లో యువతకు ప్రభుత్వం తరుఫున రూ.10 లక్షలతో ఉపాధి అవకాశాలు..
-వ్యవసాయానికి పెద్దపీట.. రైతు కన్నీరు పెట్టకుండా చర్యలు..లాభసాటిగా చేస్తాం.. మద్దతు ధర, ఫుడ్ ప్రాసెసింగ్ చర్యలు, రిజర్వాయర్లు, ఆధునీకరణ
-మన ఆంధ్రప్రదేశ్, మన ఉద్యోగాలు పేరిట జనసేన ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేస్తుంది. నిరుద్యోగుల సంక్షేమం కోసం ప్రైవేటురంగంలో 5 లక్షల ఉద్యోగాలు
-ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ, సీపీఎస్ ను రద్దు చేస్తాం.. పాత పెన్షన్ విధానం అమలు చేస్తాం
Also Read: Nagababu: జగన్ మళ్లీ గెలిస్తే వస్తే ఏపీ నుంచి వలసలు : నాగబాబు సంచలన వ్యాఖ్యలు