Tamil Nadu CM Stalin- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన సేవను చెప్పుకోరు. ఆయన ఎంతో మందికి ఎన్నో కోట్ల రూపాయల సాయం చేశారు. తమకు ఆపద ఉంది ఆదుకోవాలంటే లక్షలు ఖర్చు చేశారు. కానీ ఏనాడు ఈ వ్యక్తిగత సాయాలను ఆయన మీడియా ముఖంగా చెప్పుకోలేదు. బాధితుల ద్వారా ఇవి బయటకు వస్తూనే ఉన్నాయి.

ఏపీలో మరణించిన కౌలు రైతుల కోసం తను సినిమాల్లో కష్టపడి పనిచేసి సంపాదించిన రూ.5 కోట్లను వెచ్చిస్తున్నారంటే ఆయన సేవా గుణం అర్థం చేసుకోవచ్చు. ఇక ఇప్పటికే జనసేన ద్వారా సేవాదానాలు కొనసాగిస్తున్నారు. పవన్ స్ఫూర్తితో జనసైనికులు సైతం పేదలకు సాయం చేస్తున్నారు.
ఇక పవన్ సాయం పొందిన వారిలో ఏపీ ప్రజలే కాదు.. తమిళనాడుకు చెందిన వారు కూడా ఉన్నారట.. ఈ విషయం తెలిసిన తమిళనాడు సీఎం స్టాలిన్ తాజాగా పవన్ కళ్యాణ్ సేవానిరతిని కొనియాడారట.. ‘‘పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందేనని.. ఆయన సేవలను కొద్దిరోజులుగా గమనిస్తూ వస్తున్నానని.. రాజకీయాల్లోనూ ఆయన హవా పెరుగుతోంది. పవన్ ఒక టార్చ్ బేరర్ లాంటివాడు’ అని సీఎం స్టాలిన్ అన్నాడట.. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఇక అప్పట్లో తమిళనాడు సీఎంగా గద్దెనెక్కాక స్టాలిన్ చేసిన పనులను పవన్ కళ్యాణ్ ప్రశంసించాడు. ప్రతిపక్షాలను సైతం నిందించకుండా వారి సలహాలు, సూచనలు తీసుకుంటూ వారికి సరైన గౌరవం ఇస్తున్నారని.. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రులు జయలలిత, పళని స్వామి ఫొటోలతో ఉన్న 65 లక్షల బ్యాగుల పంపిణీకి చర్యలు చేపట్టి అందరి చేత ప్రశంసలు అందుకున్నారు. ప్రత్యర్థుల ఫొటోలతో సీఎం స్టాలిన్ పంపిణీ చేయడం.. కక్షసాధింపు చర్యలను మానుకోవడం చూసి పవన్ సహా అందరూ ప్రశంసలు కురిపించారు.