Milk Price Hike: దేశంలో ధరలు మోత మోగుతున్నాయి. ఇప్పటికే పెట్రో ధరలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ప్రస్తుతం మరో పిడుగు పడుతోంది. అమూల్ పాల ధరలను రూ.2 పెంచుతూ నిర్ణయం తీసుకోవడం సంచలనం కలిగిస్తోంది. ధరాభారంతో ప్రజల నెత్తిన భారం పడుతోంది. గుజరాత్ మినహా అన్ని రాష్ర్టాల్లో ధరల పెంపు కలవరపెడుతోంది. అమూల్ బ్రాండ్ పాలు, పాల ఉత్పత్తులను విక్రయిస్తున్న గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఎండీ తెలిపారు. ఫుల్ క్రీమ్ పాల ప్యాకెట్ ధర లీటరుకు రూ. 61 నుంచి రూ.63కు పెరిగింది.

అమూల్ కంపెనీ అంతకుముందు ఆగస్టులో పాల ధరను లీటర్ కు రూ.2 చొప్పున పెంచింది. ఈ ఏడాది పాల ధర పెరగడం ఇది మూడోసారి కావడం గమనార్హం. పశుగ్రాసం ధర పెరగడం వల్ల పాల ధరను పెంచేందుకు నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. పశుగ్రాసం రేటు ఆగస్టులో 9 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరడం ఆందోళన కలిగిస్తోంది. సెప్టెంబర్ లో ధర తగ్గినప్పటికి ప్రస్తుతం ఆందోళనకరంగా మారింది. పశుగ్రాసం ద్రవ్యోల్బణం రేటు కంటే రెట్టింపు స్థాయిలోనే ఉందని గణాంకాలు చెబుతున్నాయి.
క్రెడిట్ కార్డు కస్టమర్లకు బ్యాడ్‌న్యూస్
మరోవైపు ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఫీజును కూడా పెంచేసింది. ఈఎంఐ లావాదేవీలపై ఉన్న ప్రాసెసింగ్ ఫీజును రూ.100 కు పెంచింది. దీంతో రెంటు పేమెంట్ చార్జీలను వసూలు చేయడానికి నిర్ణయించుకుంది. రెంట్ పేమెంట్ లావాదేవీలకు ఇప్పటి వరకు ఎలాంటి చార్జీలు లేకున్నా ప్రస్తుతం 18 శాతం జీఎస్టీతో పాటు రూ.99 వసూలు చేయనుంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డు ద్వారా ఎవరైనా అద్దె చెల్లింపులు చేసినట్లయితే ప్రాసెసింగ్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. దేశీయ బ్యాంకు ఎస్బీఐ క్రెడిట్ కార్డు వినియోగదారులకు షాకింగ్ న్యూస్ చెప్పింది.

ఈఎంఐ లావాదేవీలపై ప్రాసెసింగ్ ఫీజు రూ.199కి పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో వినియోగదారులపై పెనుభారం పడనుంది. పెంచిన చార్జీలు నవంబర్ 15 నుంచి అమల్లోకి రానున్నట్లు చెబుతున్నారు. దేశంలో పెరుగుతున్న ధరాభారంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పెరుగుతున్న ధరలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. దసరా పండుగ తరువాత ధరల మోత మోగించడంతో ఇక ప్రజల జీవనంలో బాధలే తప్ప సంతోషాలు ఉండవని తెలుస్తోంది. ఆర్థిక లావాదేవీలపై ఇలా రేట్లు పెంచడంతో ఇక సామాన్యుడి జీవనం ఎలా అని ప్రశ్నలు వస్తున్నాయి.