
Pawan Kalyan is a responsible political leader : జనసేనాని పవన్ కళ్యాణ్ మరోసారి బాధ్యత కలిగిన నాయకుడిగా వ్యవహరించారు. తన హుందాతనాన్నిప్రదర్శించారు. ప్రజాస్వామ్య నిలయమైన అసెంబ్లీని గౌరవిస్తూ తన షెడ్యూల్ ను మార్చుకున్నారు. కోట్లాది మంది ఆరాధించే అభిమానులు ఉన్నా.. లక్షలాది మంది జన సైనికులు ఉన్నా.. పవన్ ముఖంలో మాత్రం ఆ ఫీలింగ్ తొణికిసలాడదు. పవన్ లో ఆ గుణమే అందర్నీ ఫిదా చేస్తుంది. రోజురోజుకూ అభిమాన గణాన్ని పెంచుతోంది. ఇంతింతై వటుడింతై అన్న చందంగా జనసేన దినదినాభివృద్ధి చెందడానికి అదే ప్రధాన కారణం. మాయదారి మహమ్మారితో ప్రాణాలు పోతున్నాయని ఉద్దానం గద్గద స్వరంతో చెబితే చలించిపోయారు. సాగు గిట్టుబాటు కాక కౌలు రైతు బలవన్మరణాలకు పాల్పడ్డారని తెలుసుకొని వారిని అక్కున చేర్చుకున్నారు. ప్రజల మాన, ప్రాణాలకు భంగం వాటిల్లినప్పుడు బాధితులకు అండగా నిలిచారు. అందుకే కోట్లాది మంది పవన్ అభిమానులుగా మారారు.
మచిలీపట్నంలో జనసేన పదో ఆవిర్భావ సభ మంగళవారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మూడు రోజుల కిందటే అమరావతి చేరుకున్న పవన్ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. అన్నివర్గాలతో సమావేశమై వారి అభిప్రాయాలను క్రోడీకరించారు. ఆవిర్భావ సభలో వాటిపై కీలక ప్రకటన చేయనున్నారు. తొలుత మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వారాహి ప్రత్యేక వాహనంలో మచిలీపట్నం వెళ్లేందుకు షెడ్యూల్ ప్రకటించారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. కానీ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో పవన్ తన షెడ్యూల్ లో మార్పులు చేసి బాధ్యత కలిగిన నాయకుడిగా నిరూపించుకున్నారు.
సాధారణంగ అసెంబ్లీ సమావేశాలంటే 175 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎంతో పాటు ముఖ్య అధికారులు హాజరవతారు. ఆ సమయంలో భారీ కాన్వాయ్ , బందోబస్తుతో ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. సామాన్యులు సైతం అసౌకర్యానికి గురవుతారు. ఇటువంటి సమయంలో తన కాన్వాయ్ తో ఎవరూ ఇబ్బందులు పడకూడదని పవన్ భావించారు. అందుకే తన షెడ్యూల్ ను మార్చుకున్నారు. మంగళగిరి కేంద్ర కార్యాలయం నుంచి కాకుండా విజయవాడ నోవాటెల్ నుంచి బయలుదేరేందుకు నిర్ణయించారు. మధ్యాహ్నం 12.30లకు విజయవాడలోని నోవాటెల్ హోటల్ నుంచి బయలుదేరుతారు. ఒంటి గంటకు ఆటోనగర్ ప్రాంతానికి చేరుకుంటారు. అక్కడి నుంచి వారాహి వాహనంలో ఆవిర్భావ సభకు బయలుదేరుతారు. తాడిగడప జంక్షన్ , పోరంకి జంక్షన్, పెనమలూరు జంక్షన్ ,పామర్రు – గుడివాడ సెంటర్ (బైపాస్), గూడూరు సెంటర్ మీదుగా కాన్వాయ్ సాగుతుంది. సాయంత్రం 5 గంటలకు మచిలీపట్నంలోని సభా ప్రాంగణానికి పవన్ చేరుకోనున్నారు.
పవన్ కళ్యాణ్ ఇలా ప్రజలు, వాహనదారుల కోసం తన షెడ్యూల్ ను మార్చుకొని అసౌకర్యం కలుగకుండా వ్యవహరించిన తీరు చూసి ఈయన ఖచ్చితంగా ఒక బాధ్యతగల నాయకుడిగా ప్రజలు కొనియాడుతున్నారు.