Pawan Kalyan KTR: పవన్ కళ్యాణ్ రాజకీయం, సినిమాఇజం వేరప్పా..

Pawan Kalyan KTR: ‘నాక్కొంచెం తిక్కుంది.. దానికో లెక్కుంది’ అని పవన్ సినిమా డైలాగులు పేల్చితే ఈలలు గోలలు వేస్తాం. అయితే సినిమాలోనే కాదు.. రాజకీయాల్లోనూ పవన్ కు కొంచెం తిక్కుంది. ఏపీలో బీజేపీతో కలిసి సాగుతూ తెలంగాణలో బీజేపీకి వ్యతిరేకంగా పవన్ రాజకీయం సాగుతోంది. బీజేపీ నేతలు ఎంత మొత్తుకున్నా సరే.. తెలంగాణలో బీజేపీతో కలవడానికి పవన్ మోహమాటపడుతున్నాడు. అదే సమయంలో కేసీఆర్, టీఆర్ఎస్ పై తన ప్రేమను చాటుకుంటూనే ఉన్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏపీలో […]

Written By: NARESH, Updated On : February 19, 2022 7:31 pm
Follow us on

Pawan Kalyan KTR: ‘నాక్కొంచెం తిక్కుంది.. దానికో లెక్కుంది’ అని పవన్ సినిమా డైలాగులు పేల్చితే ఈలలు గోలలు వేస్తాం. అయితే సినిమాలోనే కాదు.. రాజకీయాల్లోనూ పవన్ కు కొంచెం తిక్కుంది. ఏపీలో బీజేపీతో కలిసి సాగుతూ తెలంగాణలో బీజేపీకి వ్యతిరేకంగా పవన్ రాజకీయం సాగుతోంది. బీజేపీ నేతలు ఎంత మొత్తుకున్నా సరే.. తెలంగాణలో బీజేపీతో కలవడానికి పవన్ మోహమాటపడుతున్నాడు. అదే సమయంలో కేసీఆర్, టీఆర్ఎస్ పై తన ప్రేమను చాటుకుంటూనే ఉన్నారు.

ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏపీలో బీజేపీతో పొత్తు ఉన్నా సరే.. తెలంగాణలో టీఆర్ఎస్ కు మద్దతిచ్చి పవన్ కళ్యాణ్ తొలి షాక్ ఇచ్చారు. ఆ తర్వాత బీజేపీ నేతలు ఎంత సర్దుకున్నా.. నచ్చజెప్పినా..కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సహా టీబీజేపీ చీఫ్ బండి సంజయ్ లు కలిసినా కూడా పవన్ కళ్యాణ్ పెద్దగా తెలంగాణబీజేపీతో కలిసి సాగడం లేదు.

అసలే పవన్ పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తున్నారు. ఇటు సినిమాలు చేస్తూ ఖాళీ సమయంలో ఏపీలో రాజకీయాలు చేస్తున్నారు. అలాంటి సమయంలో తెలంగాణలో కాడి పూర్తిగా వదిలేసినట్టే కనిపిస్తున్నారు. ఈక్రమంలోనే అధికార టీఆర్ఎస్ ను నెత్తినపెట్టుకుంటున్నారు.

తాజాగా పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘భీమ్లానాయక్’ ప్రిరిలీజ్ ఈవెంట్ కు మంత్రి కేటీఆర్ ను చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించారు. మంత్రి కేటీఆర్ ను స్వయంగా కలిసి దర్శకుడు తివ్రికమ్, నిర్మాత నాగవంశీ ఈ వేడుకకు రావాలని కోరారు. నిజానికి పవన్ కళ్యాణ్ అనుమతి లేకుండా.. ఆయన సూచన లేకుండా ఇది జరగదు. పవన్ కళ్యాణ్ యే వీళ్లను పంపించి ఉంటారు. దీన్ని బట్టి ఏపీలో బీజేపీతో సాగుతున్నా కూడా తెలంగాణలో టీఆర్ఎస్ తో స్నేహాన్ని పవన్ చాటుకుంటున్నట్టు అర్థమవుతోంది.

ఇప్పటికే కేసీఆర్, కేటీఆర్ లు బీజేపీపై ఒంటికాలితో లేస్తున్నారు. చీల్చిచెండాడుతున్నారు. ఏపీలో బీజేపీతో పొత్తులో ఉండి కూడా పవన్ కళ్యాణ్ తన సినిమా వేడుకకు కేటీఆర్ ను ఆహ్వానించడం హాట్ టాపిక్ గా మారింది. వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ కానకష్టం అని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో పవన్ అడుగులు బీజేపీకి దూరంగా పడుతున్నాయా? అన్న చర్చ కూడా సాగుతోంది. అదే జరిగితే ఏపీ బీజేపీకి కష్టకాలం వచ్చినట్టే.. 2024లో పవన్ కొత్త పొత్తులతో వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

అయితే సినిమాలు వేరు.. రాజకీయం వేరు అని పవన్ కళ్యాణ్ భావిస్తే మాత్రం తెలంగాణలో వైరం.. ఏపీలో స్నేహాన్ని పవన్ కొనసాగించవచ్చు. కానీ ఒక్కటే మనిషి ఇలా రెండూ వేర్వేరు ధోరణులు ఉంటే మాత్రం పార్టీ కేడర్ ను కన్ఫ్యూజ్ చేయడం తప్పితే మరొకటి ఉండదు. మరి పవన్ రాజకీయం ఎటువైపు సాగుతుందనేది వేచిచూడాలి.