Pawan Kalyan: జనసేనాని పవన్ కళ్యాణ్ చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మరోసారి బయటకొచ్చాడు. తాజాగా ఏపీలో ప్రబలుతున్న కరోనా తన ఆందోళన వ్యక్తం చేశాడు. పనిలో పనిగా తెలంగాణను కలిపి కొట్టాడు. ప్రస్తుతం కేసులు పెరుగుతున్న పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మరింత అప్రమత్తతతో నివారణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. మొబైల్ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తే ప్రయోజనం ఉంటుందన్నారు. కరోనా మొదటి వేవ్ లో పాటించిన ట్రాక్ అండ్ ట్రేస్ విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలన్నారు.
ఇక ఏపీలో రాత్రి కర్ఫ్యూ, సమావేశాలు, వేడుకలు, థియేటర్లపై పాక్షిక నిషేధం పెట్టి స్కూళ్లు తెరవడం ఏంటని పవన్ నిలదీశారు. పాఠశాలల్లో తరగతుల కొనసాగింపు సరికాదన్నారు. కరోనా తగ్గే వరకూ పాఠశాలల తరగతులు వాయిదా వేయాలని కోరారు.
పిల్లలకు అసలు వ్యాక్సినేషన్ కాలేదు. వారిలో రోగనిరోధక శక్తి తక్కువ. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పాఠశాలలు తెరవద్దని వైసీపీప్రభుత్వానికి పవన్ విజ్ఞప్తి చేశాడు.
ఇంతటి కరోనా క్లిష్ట పరిస్థితుల్లో మద్యం దుకాణాలను మరో గంటపాటు అదనంగా తెరిచి ఉంచడాన్ని పవన్ విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం అనాలోచిత వైఖరిని వెల్లడిస్తోందని విమర్శించారు. ఈ సమయంలో ప్రజలకు నిత్యావసరాలు ఎలా ఇవ్వాలి.. వైద్య సేవలు మెరుగుపరిచేందుకు కార్యాచరణ ప్రకటించాలి కానీ.. మద్యం అమ్మకాలపై దృష్టి పెట్టడం ఏమిటిని నిలదీశారు. ప్రజలంతా కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు.