Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan : మీ తాతకి TP నాయక్ ట్రీట్మెంట్ ఇస్తే..నీకు భీమ్లా నాయక్ ట్రీట్మెంట్...

Pawan Kalyan : మీ తాతకి TP నాయక్ ట్రీట్మెంట్ ఇస్తే..నీకు భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ ఇస్తా : ద్వారంపూడికి పవన్ కళ్యాణ్ కౌంటర్

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ అభిమానులు మరియు జనసేన పార్టీ కార్యకర్తలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ‘వారాహి విజయ యాత్ర’ ఎట్టకేలకు ఈమధ్యనే ఉభయగోదావరి జిల్లాల్లో ప్రారంభమై అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకుంటూ ముందుకు పోతున్న సంగతి అందరికీ తెలిసిందే. కత్తిపూడి సభ తో ప్రారంభమైన వారాహి యాత్ర , పిఠాపురం మీదుగా నేడు కాకినాడ కి చేరుకుంది.

ఈ మూడు ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ సభలు నిర్వహించే ఒక్క రోజు ముందు ఆ ప్రాంతం లో వివిధ రంగాలకు చెందిన వారితో చర్చలు జరుపుతూ, వారి నుండి సలహాలు తీసుకొని, ఆ తర్వాత జనవాణి కార్యక్రమాలను నిర్వహించి స్థానిక ప్రజల నుండి సమస్యలను తెలుసుకుంటూ, వారి నుండి వినతి పత్రాలు సేకరిస్తున్నాడు. ఆ సేకరించిన వినతి పాత్రలను ఆధారంగా చేసుకొని ఆయన బహిరంగ సభలో గొంతెత్తి ప్రభుత్వాధికారులను నిలదీస్తున్నాడు. ఇక నేడు కాకినాడ సభలో ద్వారంపూడి చంద్ర శేఖర్ రెడ్డి ని ఉద్దేశిస్తూ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

ఆయన మాట్లాడుతూ ‘ ఈ కాకినాడ MLA ద్వారంపూడి చంద్ర శేఖర్ రెడ్డి, వాళ్ళ పార్టీ అధికారం లోకి వచ్చిందనే గర్వం తో 151 మంది గెలిచారని అహంకారం తో, ఈ పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు, ఆయన ఇక ఏమి పీకుతాడులే అని తలబిరుసుతో , నోటికి వచ్చినట్టుగా అసభ్య పదజాలం ఉపయోహించాడు. అతను నన్ను అన్ని మాటలు అన్నా కూడా నాకేమి కోపం రాలేదు. కానీ నన్ను అన్నందుకు మన జనసైనికులు, వీరమహిళలు అతని ఇంటి ముందుకెళ్లి ధర్నా చేసారు.అప్పుడు ఈ డెకాయిట్ చంద్ర శేఖర్ రెడ్డి తన గూండాలతో మా ఆడపడుచూలాలపై దాడి చేయించి , వాళ్ళను కులం పేరుతో చాలా నీచంగా దూషించాడు. ఇంకొక్కసారి నువ్వు అలా ప్రవర్తిస్తే, నాదైన రోజు ఒకటి వస్తుంది, గతం లో మీ తాత ని TP నాయక్ అనే SI ఇలాగే రౌడీయిజం చేస్తే జీపు వెనకాల కట్టేసి రోడ్డు మొత్తం పరిగెత్తించాడు.ఆ రోజు మీ తాత TP నాయక్ దెబ్బ రుచి చూస్తే, నేను నీకు భీమ్లా నాయక్ దెబ్బ రుచి చూపిస్తాను’ అంటూ పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

 

ఎమ్మెల్యే ద్వారంపూడి ప‌వ‌న్ వార్నింగ్... వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెల‌వ‌నివ్వ‌ను : Pawan Kalyan

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version