వైద్యులకు అండగా నిలిచిన జనసేనాని

కరోనాలాంటి విపత్కర పరిస్థితుల్లో సేవలందిస్తున్న వైద్యులపై దాడులకు పాల్పడటాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఖండించారు. దేశంలోని పలుచోట్ల వైద్యులపై కొందరు దుండగులు దాడులకు పాల్పడటం హేయమైన చర్య అన్నారు. కరోనా మహమ్మరిపై అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్న వైద్యులకు ప్రతీఒక్కరు అండగా నిలువాల్సిన సమయమిదని అన్నారు. అలాంటి వారిపై దాడులు చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. వైద్యులకు జనసైనికులు అండగా నిలువాలని ఆయన మంగళవారం ట్వీట్ చేశారు. కరోనాపై పోరాడుతున్న వైద్య సిబ్బందిపై దాడులకు పాల్పడితే వాళ్లు […]

Written By: Neelambaram, Updated On : April 21, 2020 3:12 pm
Follow us on

కరోనాలాంటి విపత్కర పరిస్థితుల్లో సేవలందిస్తున్న వైద్యులపై దాడులకు పాల్పడటాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఖండించారు. దేశంలోని పలుచోట్ల వైద్యులపై కొందరు దుండగులు దాడులకు పాల్పడటం హేయమైన చర్య అన్నారు. కరోనా మహమ్మరిపై అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్న వైద్యులకు ప్రతీఒక్కరు అండగా నిలువాల్సిన సమయమిదని అన్నారు. అలాంటి వారిపై దాడులు చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. వైద్యులకు జనసైనికులు అండగా నిలువాలని ఆయన మంగళవారం ట్వీట్ చేశారు.

కరోనాపై పోరాడుతున్న వైద్య సిబ్బందిపై దాడులకు పాల్పడితే వాళ్లు తమ విధులను ఎలా నిర్వర్తించగలుగుతారని ప్రశ్నించారు? ప్రజల ప్రాణాల కోసం వైద్య సిబ్బంది తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడుతున్నారని తెలిపారు. అలాంటి వారికి ప్రభుత్వం తగిన భద్రత కల్పించాలని కోరారు. కాగా దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో వైద్యులపై చోటుచేసుకుంటున్న దాడులను అరికట్టేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కోరింది. లేనట్లయితే ఏప్రిల్ 23న తేదిన బ్లాక్ డేగా ప్రకటిస్తామని హెచ్చరించింది. ఈక్రమంలోనే వైద్య సిబ్బందికి జనసేన పార్టీ తరపున అండగా ఉంటామని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.