Pawan Kalyan: ప్రధాని నరేంద్ర మోడీ( Prime Minister Narendra Modi) జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగం సర్వత్రా ఆకట్టుకుంది. ప్రధాని ప్రసంగాన్ని అందరూ ఆహ్వానిస్తున్నారు. ఈ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. మోడీ ప్రసంగాన్ని పవర్ఫుల్ మెసేజ్ గా అభివర్ణించారు. భారతదేశ ప్రజలకు, అంతర్జాతీయ సమాజానికి ప్రధాని ఇచ్చిన స్పష్టమైన సందేశం అభినందనీయమన్నారు. ఉగ్రవాదం, చర్చలు.. ఉగ్ర దండగలు, వ్యాపారం.. రక్తం, నీరు కలిసి వెళ్లలేదని మోదీ చెప్పిన మాటలు ఎంతో గంభీరంగా, ధైర్యవంతంగా ఉన్నాయని పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఉగ్రవాదంపై దేశం తీసుకుంటున్న కఠినమైన వైఖరిని ప్రపంచానికి స్పష్టంగా చూపించిందని ప్రశంసించారు. తమ సందేశం ముగింపులో భారత్ మాతాకీ జై అంటూ నినదించి దేశభక్తిని చాటుకున్నారు పవన్ కళ్యాణ్. ప్రధాని ప్రసంగం దేశ ప్రజలలో ఆత్మవిశ్వాసాన్ని, గౌరవాన్ని మరింత పెంచిందని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదంపై భారత్ తీసుకున్న గట్టి నిర్ణయాలను తాను సంపూర్ణంగా మద్దతిస్తున్నట్లు పవన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
Also Read: చుట్టూ శత్రువలే.. అయినా ఇప్పటి వరకూ ఓటమెరుగని దేశం.. ఇజ్రాయెల్ విజయరహస్యమిదీ
* ప్రముఖుల స్పందన
ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం పై ప్రముఖులు స్పందిస్తున్నారు. ఉగ్రవాదం విషయంలో భారతదేశం( India) అనుసరిస్తున్న వైఖరిని ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రసంగం ద్వారా ప్రపంచానికి స్పష్టం చేశారని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా స్పందించారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా దేశ శత్రువులకు వారి సరిహద్దులేమిటో ప్రధాని స్పష్టంగా తెలియజేశారని కొనియాడారు. మరోవైపు రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబాల్ మాట్లాడుతూ ఉగ్రవాదం పై పోరాటంలో ప్రతిపక్షాలు ప్రధాని మోదీకి మద్దతుగా నిలుస్తాయని స్పష్టం చేశారు. పాకిస్తాన్ ను ఉగ్రవాద దేశంగా ప్రకటించే ధైర్యాన్ని ప్రధాని చూపించాలని సూచించారు. అదే సమయంలో భారత్ పాకిస్తాన్ వివాదంలో అమెరికా జోత్యం గురించి ప్రధాని తన ప్రసంగంలో ఎందుకు ప్రస్తావించలేదని సిబల్ ప్రశ్నించారు.
* పవన్ స్పందన వైరల్..
ఏపీ నుంచి ప్రధాని ప్రసంగంపై పవన్( Pawan Kalyan) స్పందన అంతటా ఆకట్టుకుంటుంది. జాతీయ సమైక్య విషయాలలో పవన్ కళ్యాణ్ ఎప్పుడు ముందంజలోనే ఉంటారు. ఇప్పుడు కూడా భారత ప్రభుత్వ చర్యలకు సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. మరోవైపు జాతీయ స్థాయిలో సైతం పవన్ కళ్యాణ్ ఇటీవల గుర్తింపు సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.