
Pawan top Priority to BC: సోషల్ స్టేటస్ రాజకీయాల్లో తరచూ వినిపించే మాట ఇది. దశాబ్దాలుగా వినిపిస్తూనే ఉంది. నలుగురైదురుకు పదవులిస్తేనో.. కోట్లలో ఉండే జనాభాల్లో ఒకటి, రెండు లక్షల మందికి రూ.10 వేలు చొప్పున పథకాలు అందిస్తేనో రాదు అది. వెనుకబడిన వర్గాలు, తరగతుల జీవితాల మూలాలలకు వెళ్లి .. వారి వెనుకబాటుపై శూలశోధన చేసి.. పరిష్కారమార్గలు చూపితేనే వారికి స్వాంతన చేకూరుతుంది. సోషల్ స్టేటస్ ఇచ్చినట్టు అవుతుంది. ఏపీలో దశాబ్దాలుగా సోషల్ స్టేటస్ మాటున జరుగుతున్న రాజకీయ క్రీడ అదే. ఒకరిద్దరికి మంత్రి పదవులు ఇవ్వడం, పదుల సంఖ్యలో నామినేట్ పోస్టులు కేటాయించడం.. దానినే సోషల్ స్టేటస్ గా మలిచి రాజకీయ లబ్ధికి వాడుకోవడం పరిపాటిగా మారింది. అయితే దీనిని అధిగమించే ప్రయత్నం చేస్తున్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.
ఏపీ సమాజంలో కమ్మ, రెడ్డిల జనాభా అత్యల్పం. కాపులు, బీసీల సంఖ్యే అధికం. కానీ ఆ రెండు వర్గాలు అధికారానికి దూరంగా ఉన్నాయి. అందునా కాపులు అగ్రవర్ణాల్లో ఉన్నారు. కానీ కమ్మ, రెడ్ల కంటే ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు. వారికి రిజర్వేషన్లు దక్కితే కానీ.. బతుకులు మారవు. అదే సాకుగా చూపి కాపులు, బీసీల మధ్య అంతులేని అగాధాన్ని సృష్టించడంలో కమ్మ, రెడ్లు సక్సెస్ అయ్యారు. అందుకే ఆ రెండు సామాజికవర్గాల కంటే కాపులంటేనే బీసీ వర్గాలకు గిట్టదు. అటు రాజ్యాధికారం దక్కక, ఇటు రిజర్వేషన్ల ఫలాలు రాక కాపులు పడుతున్న బాధలు అన్నీఇన్నీకావు. ఎన్నికలు వచ్చిన ప్రతీసారి కాపు రిజర్వేషన్లు తెరపైకి రావడం, తీరా అధికారంలోకి వచ్చాక కనుమరుగవ్వడం పరిపాటిగా మారింది.
అయితే ఇప్పుడు పవన్ పై కాపు ముద్ర వేసి బీసీలను దూరం చేసే ఎత్తుగడ ఒకటి కొనసాగుతోంది. పవన్ ను ఒక కులానికి పరిమితం చేసే రాజకీయ క్రీడ ఒకటి ప్రారంభించారు. జనసేన ఆవిర్భవించి పదేళ్లవుతోంది. కానీ పవన్ ఏనాడూ కాపులకు అనుకూల ప్రకటన చేయలేదు. ఇటీవల కాపుల్లో ఐక్యత లేకపోవడం వల్లే నష్టపోతున్నారని మాత్రమే చెప్పారు. అదే జరిగితే గాజువాక, భీమవరంలో తాను ఎందుకు ఓడిపోతానని ప్రశ్నించారు. అప్పటి నుంచి కొత్త ప్రచారం మొదలు పెట్టారు. అటు కాపుల నుంచి బలిజ, శెట్టి బలిజ, ఒంటరి, తెలగ కులాలను వేరుచేయడం ప్రారంభించారు.
మరోవైపు జనసేనలో ఇతర నాయకులు చోటెక్కడుందని ప్రచారం ప్రారంభించారు. జనసేన అంటే పవన్, నాదేండ్ల మనోహర్, నాగబాబు అన్న ముగ్గురేనని వైసీపీ గోబెల్స్ ప్రచారం చేస్తోంది. కేవలం పవన్ పక్కనే నాదేండ్ల మనోహర్ ను మాత్రమే కూర్చోబెడుతున్నారన్న కొత్త వాదన తెరపైకి తెస్తున్నారు. కానీ ఆ పార్టీ యువశక్తి నుంచి అన్నిరకాల వేదికల వద్ద కనిపిస్తున్నది బడుగు బలహీన వర్గాల వారే. ఒక సైకిల్ మెకానిక్ కుమారుడు, ఒక కలాసీ కొడుకు, ఆర్టీసీ కార్మికుడు కుమారుడు.. ఇలా కిందిస్థాయిలో ఉన్నవారినే తన పక్కన కూర్చొబెట్టి మాట్లాడిస్తున్నారు పవన్. అంతెందుకు పార్టీ ఆవిర్భావ సభ సన్నాహాల్లో భాగంగా జరిగిన బీసీ సదస్సులో రాష్ట్రం నలుమూల నుంచి వచ్చిన సామాన్యులను పక్కనపెట్టుకొని వారి అభిప్రాయాలను సవధానంగా విన్నారు పవన్. అటువంటి వ్యక్తిపై సోషల్ స్టేటస్ అనే ముద్రను వేయాలని చూస్తున్నారు. దీనిపై జన సైనికులు కూడా గట్టిగానే రిప్లయ్ ఇస్తున్నారు. సమాజంలో వెనుకబడిన వర్గాల వారికి, వారి అభ్యున్నతికి కృషిచేసిన మహనీయులను బయట ప్రపంచానికి పరిచయం చేసింది జనసేన పార్టీయేనని గుర్తుచేస్తున్నారు.