Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan's CM hope come true: బీసీలు అండగా.. పవన్ కళ్యాణ్ సీఎం ఆశ...

Pawan Kalyan’s CM hope come true: బీసీలు అండగా.. పవన్ కళ్యాణ్ సీఎం ఆశ నెరవేరుతుందా?

Pawan Kalyan’s CM hope come true: జనసేన పార్టీ అధికారంలోకి వస్తే బీసీలను సీఎం చేస్తుందా..? కాపు వ్యక్తినే సీఎం గా ప్రకటిస్తుందా..? ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఇదే చర్చనీయాంశంగా మారింది. అసలు జనసేన వ్యూహం ఏంటి..? కాపులు, బీసీలను ఏకతాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నాలను పవన్ కళ్యాణ్ చేస్తున్నారా..? ఈ కథనంలో ఆ విషయాలను తెలుసుకుందాము.

రాష్ట్రంలో అధికార వైసిపి నిరంకుశత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్న జనసేన అదినేత పవన్ కళ్యాణ్ అందుకు అనుగుణంగానే కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. వైసీపీకి వ్యతిరేకంగా పోరాటం సాగించే శక్తులను ఏకం చేసే ప్రయత్నాలతో పాటు రాష్ట్రంలో బలమైన ఓటు బ్యాంకు కలిగిన కాపు, బీసీలను ఒకటి చేసే దిశగాను పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారు. ఒకపక్క తెలుగుదేశం పార్టీతో పొత్తులు వ్యవహారం నడుస్తుండగా, మరోపక్క అవసరమైతే ఒంటరిగా బరిలోకి దిగేందుకు సిద్ధమన్న సంకేతాలను పవన్ కళ్యాణ్ ఇస్తున్నారు. తాజాగా కాపు సంక్షేమ సేన, బీసీ కులాల నేతలతో నిర్వహించిన సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తున్నాయి. బీసీలు, కాపులు ఏకతాటిపైకి రావాలని, రాష్ట్రంలో బలమైన ఓటు బ్యాంకు కలిగిన ఈ రెండు వర్గాలు కలిస్తే బీసీ, కాపు సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యేందుకు అవకాశం ఉందని పవన్ కళ్యాణ్ పేర్కొనడం, దీనికి ఆయా వర్గాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించడంతో రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.

బీసీలు అండతో.. సీఎం సీటు దిశగా..

మొన్నటి వరకు కాపులు రాజ్యాధికారం కోసం ఏకం కావాలని పిలుపునిచ్చిన పవన్ కళ్యాణ్.. తాజాగా బీసీలు ఈ దిశగా ఆలోచన చేయాలని పిలుపునిచ్చారు. బీసీ లందరూ ఏకమైతే రాజ్యాధికారం సాధించడం సులభం అవుతుందన్న భావనను పవన్ కళ్యాణ్ వ్యక్తం చేశారు. ఇప్పుడు ఇదే రాజకీయాల్లో సర్వత్ర ఆసక్తిని కలిగిస్తుంది. ఈ మాటలు వెనక అవసరమైతే బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేసేందుకు పవన్ కళ్యాణ్ వెనుకాడడం లేదన్న భావనను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. కాపులతో పాటు బీసీలను జనసేన వైపు చూసేలా తాజా వ్యాఖ్యలతో పవన్ కళ్యాణ్ చేసినట్టు అయిందని పలువురు విశ్లేషిస్తున్నారు. బీసీలను జనసేన వైపు చూసేలా చేయడం ద్వారా వారి అండతో ముఖ్యమంత్రి కావాలన్నది పవన్ కళ్యాణ్ ఆలోచనగా చెబుతున్నారు. బీసీలు అండగా ఉంటే సీఎం కావాలన్నా పవన్ కళ్యాణ్ కోరిక నెరవేరుతుందన్న విశ్లేషణలు వ్యాఖ్యల నేపథ్యంలో వినిపిస్తున్నాయి.

కులపు ముద్రపడితే ఇబ్బంది..

ఇక జనసేన పార్టీ అనగానే కాపులకు సంబంధించిన పార్టీగా పెద్ద ఎత్తున ప్రసారం సాగుతోంది. ఈ ముద్ర నుంచి బయట పడేందుకు బీసీలతో సఖ్యతగా ఉండడంతో పాటు వారికి ఉన్నత పదవులు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామన్న భావనను పవన్ కళ్యాణ్ వ్యక్తం చేస్తున్నారు. పవన్ ఇచ్చిన పిలుపు బిసి వర్గాల్లో చర్చకు కారణమైంది. కాపులు, బీసీలు రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవడం సులభం అవుతుందన్న విశ్లేషణలు సర్వత్ర వ్యక్తం అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ తాజా వ్యాఖ్యల వెనుక పెద్ద ఆలోచన దాగి ఉందన్నది ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు నుంచి వినిపిస్తున్న మాట.

Exit mobile version