
తిరుపతి ఉప ఎన్నికల వేళ రాజకీయం రంజుగా సాగుతోంది. బీజేపీకి మద్దతుగా రాజకీయం చేస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను తాజాగా జగన్ సర్కార్ టార్గెట్ చేసింది. పవన్ నటించిన ‘వకీల్ సాబ్’ మూవీకి జగన్ ప్రభుత్వం అడుగడగునా అడ్డంకులు సృష్టిస్తోందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. పవన్ పై ఇలా ప్రతీకారం తీర్చుకుంటోందని అంటున్నారు.
పవన్ కళ్యాణ్ సినిమాను టార్గెట్ చేసిన వైసీపీకి బీజేపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఈ మేరకు చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.
పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్ ’ టికెట్ల ధరల్ని పెంచుకునేందుకు హైకోర్టు అనుమతించినా వైసీపీ సర్కార్ అడుగడుగునా అడ్డు పడటాన్ని జనసేన , బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే విషయాన్ని టార్గెట్ చేస్తూ వైసీపీ సర్కార్ పై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి విమర్శలు గుప్పించారు.
‘వకీల్ సాబ్ కు మీరు షాకిస్తే.. తిరుపతిలో మీకు ఓటర్లు షాకివ్వబోతున్నారంటూ’ బీజేపీ నేత విష్ణు చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది. తిరుపతిలో పవన్ స్టామినా పవర్ చూసి తట్టుకోలేకనే ఆయన సినిమాను వైసీపీ సర్కార్ అడ్డుకుంటోందని విష్ణు ఆరోపించారు.
ఏపీలో ఇప్పుడు నడుస్తోంది వకీల్ సాబ్ సినిమా టికెట్ వ్యవహారం కాదు.. తిరుపతి ఎంపీ టికెట్ ఎన్నికల వ్యవహారం అంటూ బీజేపీ నేత విష్ణు తన ట్వీట్లో విమర్శలు గుప్పించారు.
రాజకీయ అంశంగా వకీల్ సాబ్ కు సినిమా ద్వారా పవన్ గారికి షాకిస్తే 17న తిరుపతిలో వైఎస్ఆర్ పార్టీకి ప్రజలు, వారి అభిమానులు మీకు షాక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారనే విషయం గుర్తు పెట్టుకోండి అంటూ విష్ణు తన ట్వీట్ లో విమర్శించారు. దీంతో ఈ ట్వీట్ ఇప్పుడు పవన్ అభిమానులు వైరల్ చేస్తున్నారు.
ఏపీలో వకీల్ సాబ్ సినిమా టికెట్ వ్యవహారం కాదు నడుస్తోన్నది,తిరుపతి యంపీ టికెట్ ఎన్నికల వ్యవహరం
రాజకీయ అంశంగా వకీల్‌సాబ్‌కు సినిమా ద్వార @PawanKalyan కు షాకిస్తే17న తిరుపతిలో @YSRCParty పార్టీ కి ప్రజలు,వారి అభిమానులు మీకు షాక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారనే విషయం గుర్తుపెట్టుకోండి.
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) April 10, 2021