మృతి చెందిన ఫ్యాన్స్ కుటుంబాలకు ఆర్థిక సహాయం ప్రకటించిన పవన్..!

నేడు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు. ప్రపంచ వ్యాప్తంగా అతనికున్న లక్షలాది మంది అభిమానులు రెండు రోజుల ముందు నుండే అతడి పుట్టినరోజు వేడుకలను జరుపుకోవాలని తీవ్రస్థాయిలో సన్నాహాలు చేస్తున్నారు. రోడ్ల మీద ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. కొంతమంది సోషల్ మీడియాలోని పోస్టులతో సరిపెట్టుకుంటే…. మరికొందరు తమ అభిమానాన్ని చాటుకునేందుకు 20-30 అడుగుల ఫ్లెక్సీలను, బ్యానర్లను పెద్ద స్తాయిలో ఏర్పాటు చేస్తున్నారు. Also Read : […]

Written By: Navya, Updated On : September 2, 2020 9:58 am
Follow us on

నేడు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు. ప్రపంచ వ్యాప్తంగా అతనికున్న లక్షలాది మంది అభిమానులు రెండు రోజుల ముందు నుండే అతడి పుట్టినరోజు వేడుకలను జరుపుకోవాలని తీవ్రస్థాయిలో సన్నాహాలు చేస్తున్నారు. రోడ్ల మీద ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. కొంతమంది సోషల్ మీడియాలోని పోస్టులతో సరిపెట్టుకుంటే…. మరికొందరు తమ అభిమానాన్ని చాటుకునేందుకు 20-30 అడుగుల ఫ్లెక్సీలను, బ్యానర్లను పెద్ద స్తాయిలో ఏర్పాటు చేస్తున్నారు.

Also Read : హ్యపీ బర్త్ డే పవన్ కల్యాణ్: సినీ, రాజకీయ ప్రస్థానం

ఇదే క్రమంలో నిన్న చిత్తూరు జిల్లా.. కుప్పం నియోజకవర్గం, శాంతిపురం మండలం లో ఒక విషాద సంఘటన చోటు చేసుకుంది. దాదాపు ఇరవై ఐదు అడుగులు ఉన్న కరెంటు పోల్ పై పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్న బ్యానర్ ను అమరుస్తూ ఏడుగురు పవన్ కళ్యాణ్ అభిమానులు కరెంట్ షాక్ కి గురి కాగా వారిలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. 

ఇక ఈ విషయమై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జనసైనికుల మరణం మాటలకందని విషాదం అని ఆయన పేర్కొన్నారు. అభిమానుల చావు తన మనసుని కలచివేసిందని అన్నారు. ఇక తల్లిదండ్రులకు దూరమైన బిడ్డలను తీసుకుని రాలేను కానీ వారి కుటుంబాలను ఆర్థికంగా అండగా నిలబడతానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.

ఇక వెంటనే విద్యుత్ ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని పార్టీ కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. ఇప్పటికే చాలా సభలలో, మీటింగ్ లలో పవన్ తన అభిమానుల పై ఉన్న ప్రేమను చాటుకోవడం చూశాం. వారికి చిన్న దెబ్బ తగిలినా తనకు కన్నీళ్ళు వస్తాయని అతనే స్వయంగా వెల్లడించాడు. ఇక అలాంటిది అతని పుట్టిన రోజున ముగ్గురు చనిపోవడం అనేది అతనిని ఎప్పటికీ బాధించే విషయమే.

Also Read : పవన్ కళ్యాణ్ బర్త్ డే ఎందుకు చేసుకోరంటే?