పనిచేయని మంత్రుల పరిస్థితి ఏంటి?

  యథా రాజా తథా ప్రజ అంటారు. ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. పని చేసే మంత్రులు కొందరైతే. పని అవసరమే లేదనే వారు కొందరు. మరొకొందరైతే ఏదో రెండున్నరేళ్ల వరకు ఇబ్బంది ఉండదని భావించి తమ సొంత వ్యాపారాలు చూసుకునే వారు కూడా ఉన్నారు. దీంతో అన్ని శాఖల్లో సమన్వయం కొరవడి పనులు ముందుకు సాగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయినా అధినేత వారిని ఏమి అనడం లేదు. ఫలితంగా వారు కూడా తమ […]

Written By: Srinivas, Updated On : July 9, 2021 8:16 am
Follow us on

 

యథా రాజా తథా ప్రజ అంటారు. ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. పని చేసే మంత్రులు కొందరైతే. పని అవసరమే లేదనే వారు కొందరు. మరొకొందరైతే ఏదో రెండున్నరేళ్ల వరకు ఇబ్బంది ఉండదని భావించి తమ సొంత వ్యాపారాలు చూసుకునే వారు కూడా ఉన్నారు. దీంతో అన్ని శాఖల్లో సమన్వయం కొరవడి పనులు ముందుకు సాగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయినా అధినేత వారిని ఏమి అనడం లేదు. ఫలితంగా వారు కూడా తమ పదవి అలంకారప్రాయమే అని భావిస్తూ తిరుగుతున్నారు. దీంతో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ముందుకు సాగని పరిస్థితి.

ముఖ్యమంత్రి జగన్ అన్ని శాఖల మంత్రులను జాగరూకతతో ఉండాలని సూచిస్తున్నావారు పెడచెవిని పడుతున్నారు. కొందరు మంత్రులైతే కాలక్షేపం చేస్తున్నారు. ఉదాసీనంగా ఉండే వారిపైనే ఆరోపణలు వస్తున్నాయి. ఏ విషయం పట్టించుకోవడమ లేదనే విమర్శలు వస్తున్నాయి. అయినా వారిలో చలనం లేకుండా పోతోంది. ఇంకొందరైతే కనీసం మీడియాకు కూడా కనిపించడం లేదు. దీంతో అసలు రాష్ర్టంలో ఏం జరుగుతుందనే అనుమానాలు ప్రతి ఒక్కరిలోనూ వ్యక్తం అవుతున్నాయి.

సీఎం జగన్ హయాంలో మంత్రులకు స్వేచ్ఛ వచ్చిందని అనుకుంటున్నారు. దీనికి ఓ ప్రధాన కారణముందని చెబుతున్నారు. ప్రతి పనిలో ప్రభుత్వ సలహాదారు తలదూర్చడమే. అన్ని శాఖలను సమన్వయం చేస్తూ ఎవరికి పని లేకుండా వారి నిర్ణయాలను కూడా ఆయనే తీసుకుంటున్నారు. దీంతో వారు ఆయనను ఏమి అనలేక తమ పనులు తాము చేసుకోలేక చిక్కుల్లో పడుతున్నారు. ఫలితంగా మౌనమే మంచిదనే అభిప్రాయానికి వస్తున్నారు. ఉన్నతాధికారులు సైతం మంత్రుల ఫోన్లు లిఫ్ట్ చేయకపోవడం గమనార్హం.

రెండున్నరేళ్ల పాటు ఏ ఇబ్బంది ఉండదనే సాకుతో కొందరు ఉదాసీనంగా ఉండిపోతున్నారు. సీఎం అడినప్పుడు చూద్దాంలే అనే ధోరణిలో పడిపోయారు. దీంతో శాఖలపై పట్టు కోల్పోతున్నారు. ఫలితంగా పనులు సాగడం లేదు. నిరంతరం పర్యవేక్షించే మంత్రులు మాత్రమే తమ శాఖలపై ఆధిపత్యం కొనసాగిస్తున్నారు. మిగతా వారంతా ఏదో సాగుతుందిలే అనే పద్ధతిలోనే పోతున్నారు. దీంతో సంబంధిత శాఖలపై రేపో మాపో జగన్ సమీక్ష నిర్వహించి అందరికి దిశా నిర్దేశం చేస్తారనే చర్చ వైసీపీ వర్గాల్లో సాగుతోంది.