ఏపీలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటుతోంది. జగన్ సీఎం అయిన తొలినాళ్ల నుంచే స్థానిక సంస్థల ఎన్నికలపై ఏపీలో చర్చ జరుగుతోంది. ఇప్పుడే.. అప్పుడే అన్నట్లు స్థానిక ఎన్నికలపై ప్రకటనలు వస్తుండటంతో కిందిస్థాయి నేతలు అలర్ట్ అవుతున్నాయి. అయితే తీరా ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనుకున్న తరుణంలో వాయిదా పడుతుండటం ఇటీవల కామన్ గా మారింది.
Also Read: గ్రేటర్ ‘ఫెయిల్యూర్’.. ఓటర్లది కాదా.. మరీ ఎవరిదీ?
ఏపీ సర్కారుకు.. ఎన్నికల కమిషనర్ నిమ్మలగడ్డ ప్రసాద్ మధ్య కొద్దిరోజులుగా వార్ నడుస్తోందని అందరికీ తెల్సిందే. త్వరలోనే నిమ్మగడ్డ ప్రసాద్ పదవీ కాలం ముగియనుంది. ఆయన పదవీలో ఉండగానే జగన్ సర్కార్ ఝలక్ ఇవ్వాలని నిమ్మగడ్డ భావిస్తున్నారు. దీంతో ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనే పట్టుదలతో ఆయన ఉన్నారు. అయితే ప్రభుత్వం నుంచి మాత్రం నిమ్మగడ్డకు పెద్దగా సహకారం లభించడం లేదని తెలుస్తోంది.
ఈనేపథ్యంలో నిమ్మగడ్డ ప్రసాద్ గతంలో హైకోర్టును ఆశ్రయించగా ఎన్నికల కమిషన్ కు ప్రభుత్వం సహకరించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రభుత్వం నుంచి ఆయన సహకారం లభించకపోగా పంచాయతీ ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించడం సాధ్యంకాదంటూ పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల కమిషన్ ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే ఏకపక్షంగా ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని చూస్తుందని ఆ పిటిషన్లో పేర్కొన్నారు.
Also Read: గ్రేటర్ మేయర్ రేసులో ఈమె.. ఖాయమట?
ఏపీలో కరోనా ఇంకా పూర్తిస్థాయిలో తగ్గలేదని.. ఇలాంటి సమయంలో స్థానిక సంస్థలు నిర్వహించలేమంటూ ద్వివేది పిటిషన్లో విన్నవించారు. ఎన్నికల నిర్వహించేందుకు నోటిఫికేషన్ ఇస్తే రాజకీయ పార్టీలు ప్రచారం.. ర్యాలీలు.. ఓటేసేందుకు ప్రజలు భారీగా పోటెత్తడం జరుగుతుందని పేర్కొన్నారు. దీనివల్ల కరోనా మరింత విజృంభించే అవకాశం ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికలు నిర్వహించడం ఎంత ముఖ్యమో.. ప్రజల ఆరోగ్యం కాపాడాల్సిన బాధ్యత కూడా అంతే ముఖ్యమని ప్రభుత్వం వాదనలు విన్పించేందుకు సిద్ధమైంది. ఈనేపథ్యంలో హైకోర్టు తీర్పు ఎవరికీ అనుకూలంగా వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్