PAN-Aadhaar linking: పన్ను ఎగవేతదారులకు చెక్ పెట్టేందుకు కేంద్రం అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఐటీఆర్ అమలు చేస్తున్నా.. చాలామంది తప్పించుకుంటున్నారు. ఇక అవినీతి సొమ్ము దేశం దాటిపోతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఆధార్‌తో పాన్‌కార్డు లింక్ తప్పనిసరి చేసింది. ఇప్పటికే చాలాసార్లు ఉచిత అవకాశం కల్పించింది. ఈ ఏడాది జూలై నుంచి రూ.1000 చార్జితో లింక్ అవకాశం కల్పించింది. ఈ గడువు కూడా డిసెంబర్ 31తో ముగియనుంది. అంటే గడువు ఇంకా ఒక్క రోజు మాత్రమే ఉంది. లింక్ చేయనిపక్షంలో పాన్‌కార్డు డీ యాక్టివేట్ అవుతుంది. దీంతో ఆదాయపు ప్రకటన ఫైలింగ్, రిఫండ్‌లు, బ్యాంకు లావాదేవీలు కష్టమవుతాయి.
స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..
వెబ్ పోర్టల్ ద్వారా…
– ఐటీ ఈ–ఫైలింగ్ సైట్‌కు (incometax.gov.in) వెళ్లండి.
– ’ఆధార్ లింక్ స్టేటస్’ ఎంపిక చేసుకోవాలి.
– పాన్, ఆధార్ వివరాలు ఇచ్చి సబ్మిట్ చేయండి.
– స్క్రీన్‌లో స్థితి కనిపిస్తుంది.
ఎస్‌ఎమ్‌ఎస్ ద్వారా
‘UID PAN’ తర్వాత 12 అక్షరాల ఆధార్ నంబర్, 10 అక్షరాల పాన్ నంబర్ ఇచ్చి 567678 లేదా 56161కు పంపండి. ఉదాయహరణ: UID PAN 34512349891 CFIED1234J.
లింక్ చేయడం ఇలా..
1. ఈ–ఫైలింగ్ పోర్టల్‌లో లాగిన్ అవ్వండి.
2. ప్రొఫైల్ సెక్షన్‌లో ’పాన్–ఆధార్ లింక్’ ఎంపిక చేయండి.
3. వివరాలు నమోదు చేసి, ఈ–పే ట్యాక్స్ ద్వారా చెల్లింపు పూర్తి చేయండి.
4. చలాన్ జనరేట్ చేసి, బ్యాంకు పోర్టల్‌లో డబ్బు చెల్లించండి.
5. తిరిగి పోర్టల్‌కు వచ్చి, పాన్, ఆధార్, పేరు వాలిడేట్ చేయండి.
6. ఆధార్ మొబైల్‌కు వచ్చే ఒటీపీతో సబ్మిట్ చేయండి.
చెల్లింపు విజయవంతమైన తర్వాత 1–2 రోజుల్లో స్థితి తనిఖీ చేయండి.
వివరాలు సరిపోలేటప్పుడు చర్యలు
– ఆధార్ వివరాలు సరిచేయడానికి UIDAI సైట్ ఉపయోగించండి.
– పాన్ సవరణకు Protean (NSDL) లేదా UTIITSLఖీ ఔలో అప్‌డేట్ చేయండి.
– సమస్యలు ఉంటే, పాన్ సర్వీస్ సెంటర్‌లో బయోమెట్రిక్ వెరిఫికేషన్ తీసుకోండి.
డెడ్‌లైన్ మిస్ అయితే పరిణామాలు
– ఆదాయపు ప్రకటన ఫైలింగ్ ఆగిపోతుంది, రిఫండ్‌లు రావు.
– టీడీఎస్, టీసీఎస్ రేట్లు ఎక్కువగా వసూలు చేస్తారు.
– బ్యాంకు ఖాతా ఓపెనింగ్, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు, ఇతర లావాదేవీలు అసాధ్యం.
జరిమానా మినహాయింపులు
డెడ్‌లైన్ తర్వాత లింక్ చేయగలిగితే రూ.1,000 జరిమానా చెల్లించాలి. అయితే, అక్టోబర్ 1, 2024 తర్వాత ఆధార్ ఐడీతో అనుపాలిత పాన్‌లకు డెడ్‌లైన్ వరకు ఉచితం. 2017 జూలై 1 ముందు పొందిన పాన్‌లకు ఇది తప్పనిసరి.