పీవోకేలో ఎన్నికలకు పాక్ కొత్త వ్యూహం..

ఆక్రమిత కాశ్మీర్లో పాక్ ప్రభుత్వం మరో కుట్రకు ప్లాన్ వేస్తోంది. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ఉగ్రవాద శిబిరాలను మోహరించి ఈ ప్రాంతాన్ని యుద్ధభూమిగా చేసిన పాక్ ఇప్పుడు ఇక్కడ ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంది. అందుకోసం భారీ వ్యూహాన్ని పన్నుతున్నట్లు సమాచారం. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఇప్పటికే పెద్ద ఎత్తున సైన్యం మోహరించింది. వీరంతా రక్షణ కార్యకలాపాల మాత్రమే చూస్తుంటారు. ప్రభుత్వం సైతం వీరి బాగోగులను చూడదు. కానీ కొత్తగా ఇక్కడ ఎన్నికలు నిర్వహించడానికి ప్లాన్ వేస్తోంది. వాస్తవానికి […]

Written By: NARESH, Updated On : June 17, 2021 8:06 am
Follow us on

ఆక్రమిత కాశ్మీర్లో పాక్ ప్రభుత్వం మరో కుట్రకు ప్లాన్ వేస్తోంది. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ఉగ్రవాద శిబిరాలను మోహరించి ఈ ప్రాంతాన్ని యుద్ధభూమిగా చేసిన పాక్ ఇప్పుడు ఇక్కడ ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంది. అందుకోసం భారీ వ్యూహాన్ని పన్నుతున్నట్లు సమాచారం. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఇప్పటికే పెద్ద ఎత్తున సైన్యం మోహరించింది. వీరంతా రక్షణ కార్యకలాపాల మాత్రమే చూస్తుంటారు. ప్రభుత్వం సైతం వీరి బాగోగులను చూడదు. కానీ కొత్తగా ఇక్కడ ఎన్నికలు నిర్వహించడానికి ప్లాన్ వేస్తోంది.

వాస్తవానికి ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. నమాజ్ జరిగిన తరువాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు ఇస్తుంటారు. ఎందుకంటే ఇక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు, ప్రభుత్వ కాల్పులు తప్ప అభివృద్ధి కనిపించదు. ప్రజల కనీస అవసరాలు పట్టించుకోరు. అందుకే తమకు విముక్తి కావాలని నిరసన తెలుపుతుంటారు. అయితే ఇప్పుడు కొత్తగా ప్లాన్ వేసి వారిని పాక్ వైపు తిప్పుకునేందుక ప్రభుత్వం వ్యూహం పన్నుతోంది.

ఇందుకోసం ప్రభుత్వం తమ సైన్యాన్ని ప్రజల ఇళ్లల్లోకి పంపుతోంది. ప్రతీ ఇంటికి వెళ్లి ప్రజల అవసరాలు, బాగోగులు తెలుసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు సైన్యాధిపతి జనరల్ భజ్వాకు అత్యంత సన్నిహితులైన కమాండర్లకు ఆ బాధ్యతలను అప్పగించారు. ఇక్కడ ఎన్నికలు నిర్వహిస్తే ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా ముందస్తుగా వారి కోపాన్ని చల్లార్చాలని పాక్ దేశాధినేత ఇమ్రాన్ ఖాన్ నిర్ణయించాడట. ఆ తరువాత వారిని పాక్ వైపుకు తిప్పుకోవాలని వారి ఆలోచనట.

ఆక్రమిత కాశ్మీర్లోని నీలమ్ వ్యాలీ, లీపా వ్యాలీ, ముజఫరాబాద్, మురీద్ కే, కోట్లీ రావల్ కోట్ తదితర ప్రాంతాల్లో ఇప్పటికే పాక్ సైన్యం ఇంటింటికి తిరుగుతూ ప్రజల అవసరాలను తీరుస్తున్నారట. ఇక ఇప్పటికే ఈ ప్రాంతంలో రూ.1546 చొప్పున మొత్తం 33,498 మందికి ప్రభుత్వం సాయంను మొదలు పెట్టింది. మరిన్ని ప్రజల అవసరాలను తీర్చి వారిని అక్కున చేర్చుకునేందకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే పాక్ ఇక్కడ ఎన్నికలు సజావుగా నిర్వహించనుందా..? లేదా..? చూడాలి..