Pakistan PM Imran Khan: పాక్ ప్రధానికి పదవీ గండం? సైన్యం లేపేస్తుందా?

Pakistan PM Imran Khan: పాకిస్తాన్ లో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ పదవికి గండం రానుంది. ఇప్పటికే ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో ఇక ఆయన పదవి ఊడటం ఖాయంగా కనిపిస్తోంది. ఏ క్షణంలోనైనా ఇమ్రాన్ పదవి పోతుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ తనకు ఓటమి లేదని బుకాయిస్తున్నారు. పాక్ సైన్యం పన్నిన పన్నాగంలో ఇమ్రాన్ ఖాన్ ఇరుక్కున్నట్లు సమాచారం. పాకిస్తాన్ లో ఏ ప్రధాన మంత్రి కూడా […]

Written By: Srinivas, Updated On : March 31, 2022 5:50 pm
Follow us on

Pakistan PM Imran Khan: పాకిస్తాన్ లో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ పదవికి గండం రానుంది. ఇప్పటికే ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో ఇక ఆయన పదవి ఊడటం ఖాయంగా కనిపిస్తోంది. ఏ క్షణంలోనైనా ఇమ్రాన్ పదవి పోతుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ తనకు ఓటమి లేదని బుకాయిస్తున్నారు. పాక్ సైన్యం పన్నిన పన్నాగంలో ఇమ్రాన్ ఖాన్ ఇరుక్కున్నట్లు సమాచారం.

Imran Khan

పాకిస్తాన్ లో ఏ ప్రధాన మంత్రి కూడా పూర్తి కాలం పనిచేయలేదు. మధ్యలోనే పదవీచ్యుతులను చేయడం అక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగానే ఇమ్రాన్ ఖాన్ ను కూడా పదవి నుంచి దింపేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈనెల 31న ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి ఏప్రిల్ 3న ఓటింగ్ నిర్వహించి ఆయనను పదవి నుంచి తప్పించేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

Also Read: RRR 6th Day Collections: టార్గెట్ రీచ్.. మొత్తం ఎన్ని కోట్లు వచ్చాయంటే

గతంలో అఫ్గనిస్తాన్ లో చోటుచేసుకున్న పరిణామాల్లో ఇమ్రాన్ ఖాన్ హస్తం ఉందని ఆరోపణలు వచ్చాయి. ఆయన కూడా వారికి అనుకూలంగా మాట్లాడటంతో ఆయన చర్యలు అందరు ఖండించారు. తాలిబన్లకు సాయం చేయడంతో అమెరికా కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇమ్రాన్ ఖాన్ ఫోన్ కు కూడా బైడెన్ సమాధానం ఇవ్వలేదంటే ఇమ్రాన్ పై ఎంతటి వ్యతిరేకత వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. దీంతో అప్పటినుంచే ఆయన పదవికి గండం ఏర్పడిందని తెలుస్తోంది.

ఈ మేరకు ప్రతిపక్షాలు ఇమ్రాన్ ఖాన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. దీనిపై ఏడు రోజుల లోపు ఓటింగ్ ఉంది. అవిశ్వాసం నెగ్గితే ఇమ్రాన్ పదవి ఊడటం ఖాయం. కొత్త ప్రధానిని ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే నవాజ్ షరీఫ్ సోదరుడు షాబాజ్ షరీఫ్ ప్రముఖంగా వినిపిస్తోంది. ఇమ్రాన్ ఖాన్ పదవి నుంచి తొలగితే ఆయనే ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. దీంతో పాక్ లో జరుగుతున్న పరిణామాలపై అందరికి ఉత్కంఠ ఏర్పడింది.

Also Read: Mega Star Chiranjeevi: షాకింగ్ : ఏనుగు పై నుంచి కిందపడ్డ మెగాస్టార్ !

Tags