Toady Tollywood Trends : టాలీవుడ్ ట్రెండ్స్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. హీరో రామ్‌చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అపోలో హాస్పిటల్స్ ఫౌండేషన్ చేస్తున్న కృషికి గుర్తింపుగా.. 2022 ఏడాదికి గానూ ఉపాసనకు నాట్ హెల్త్ సీఎస్ఆర్ అవార్డు దక్కింది. ఓ గొప్ప కార్యక్రమంలో తమను భాగం చేసిన తాతయ్య, అపోలో హాస్పిటల్స్ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డికి ఈ ఘనత దక్కుతోందన్నారు.
మరో అప్ డేట్ విషయానికి వస్తే.. ప్రముఖ టాలీవుడ్, భోజ్ పురీ విలన్ రవి కిషన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. రవి కిషన్ సోదురుడు రవేశ్ కిషన్ అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్లో తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని రవికిషన్ స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. తండ్రి చనిపోయిన కొన్ని రోజులకే అన్న మరణించడం తీవ్ర లోటని ఆయన అన్నారు. ప్రస్తుతం రవి కిషన్ గోరఖ్ పూర్ ఎంపీగా ఉన్నారు.
ఇంకో అప్ డేట్ ఏమిటంటే.. కన్నడ పవర్ స్టార్ దివంగత పునీత్ రాజ్‌కుమార్ నటించిన చివరి చిత్రం “జేమ్స్”. గత నెల థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ హక్కులను సోనీ లైవ్ దక్కించుకుంది. ఏప్రిల్ 14న “జేమ్స్” మూవీని రిలీజ్ చేయనున్నట్లు సోనీ లైవ్ ప్రకటించింది. ఓటీటీలో ఈ మూవీ కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.
అలాగే మరో అప్ డేట్ విషయానికి వస్తే.. బాహుబలి2 తర్వాత సినీ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూసే సీక్వెల్‌గా KGF2 నిలిచింది. ఈక్రమంలో సాంగ్స్, ట్రైలర్స్‌తోనే ఈ చిత్రం బాహుబలి2, RRR రికార్డులపై గురి పెట్టింది. ఇటీవల విడుదలైన ట్రైలర్ 109 మిలియన్ వ్యూస్ దాటి ఇండియాలోనే టాప్ ట్రైలర్ అనిపించుకుంది. ప్రీరిలీజ్ బిజినెస్ కూడా ఆస్థాయిలోనే ఉంది. ఇక విడుదల తర్వాత పాజిటివ్ టాక్ వస్తే, వసూళ్లు కూడా అదే స్థాయిలో ఉండనున్నాయి.