Pakistan : పై ఉపోద్ఘాతానికి చైనా, పాకిస్తాన్ దేశాలు నూటికి నూరుపాళ్లు సరిపోతుంటాయి. చైనా పక్క దేశాలను ఆక్రమించి.. పక్క దేశాలలో రాజకీయ అస్థిరత సృష్టించి లాభ పడుతూ ఉంటుంది. నియంతృత్వ విధానంలో పరిపాలన సాగించి.. ప్రజలను హింసించుకుంటూ.. ప్రపంచ శక్తిగా ఎదగాలని చూస్తూ ఉంటుంది. గిట్టని దేశాలను కొడుతుంటుంది.. నచ్చని పరిపాలకులను ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మనదేశంలో గత నెలలో చోటు చేసుకున్న పహల్గామ్ ఘటన వెనుక చైనా హస్తం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.. ఎందుకంటే పాకిస్తాన్ దేశాన్ని కొన్ని దశాబ్దాలుగా చైనా వాడుకుంటూనే ఉంది. ఇప్పుడు కూడా చైనా పాకిస్తాన్ కు వంత పాడుతూనే ఉంది. ఇక ఇప్పుడు పాకిస్తాన్ దేశానికి రక్షణ పరికరాలు.. ఇతర ఆయుధ సామగ్రిని చైనా చేరవేర్చుతోంది.
ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో..
భారత త్రివిధ దళాలు పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం విధితమే. ఈ దాడుల్లో పాకిస్తాన్ భూ భాగంలో ఉన్న 9 ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడి చేసింది. ఉగ్రవాదులకు సంబంధించిన ఆస్తులను ధ్వంసం చేసింది. భారత్ చేసిన ఈ దాడుల తర్వాత పాకిస్తాన్ ప్రతీకారంతో మండిపోతున్నది. ఇక మన దేశంలోని ప్రధానంగా ఉన్న 15 నగరాలలో ఉన్న సైనిక స్థావరాలపై పాకిస్తాన్ దాడులతో ప్రయత్నించింది. దీనికి సంబంధించిన వివరాలను జాతీయ మీడియా వెల్లడించింది.. చైనా దేశాల చెందిన BVR మిస్సైల్స్ ద్వారా దాడులు చేసేందుకు ప్రయత్నించింది. అయితే దానిని మనదేశంలోని S400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ సమర్థవంతంగా అడ్డుకున్నది. జమ్మూ, శ్రీనగర్, అమృత్ సర్, పటాన్ కోట్, బటిండా, జలంధర్, లూధియానా, చండీగఢ్, అవంతిపుర, భుజ్, పలోడి తోపాటు అనేక నగరాలలో దాడులు చేసేందుకు పాక్ ప్రయత్నించింది. అయితే ఈ నగరాలు మొత్తం పాకిస్తాన్ దేశానికి సరిహద్దు నగరాలుగా ఉండడం విశేషం.. అయితే ఈ నగరాలలో మన దేశానికి సంబంధించిన అత్యంత సున్నితమైన సైనిక స్థావరాలు ఉన్నాయి. వాటిపై దాడి చేసి మన దేశ ఆత్మస్థైర్యాన్ని దెబ్బ కొట్టాలని పాకిస్తాన్ ప్రయత్నించింది. దీనికి చైనా సహకారం తీసుకుంది. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. పాకిస్తాన్ ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతుందని ముందే అంచనా వేసిన భారత్.. ముందుగానే సన్నద్ధమైంది. ఏ మాత్రం దాయాది దేశానికి అవకాశం ఇవ్వకుండా గట్టి కౌంటర్ ఇచ్చింది. మనదేశంలో సున్నితమైన ప్రాంతాలలో దాడులు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. డ్రాగన్ దేశానితో అంట కాగినప్పటికీ.. మన దేశ వ్యవస్థలపై దాడికి చేసిన దారుణాన్ని.. భారత్ అత్యంత సమర్థవంతంగా దాయాది దేశ పన్నాగాన్ని తిప్పి కొట్టింది.