Pakistani Operatives In National Parties: నిత్యం మన దేశంలో మంట పుట్టించాలి. అగ్గి రగిలించాలి. దేశం కాలిపోతుంటే ఆనందించాలి
.. ఇలానే ఉంటుంది పాకిస్తాన్ పాలకుల వ్యవహార శైలి. అభివృద్ధిలో పోటీ పడరు. ప్రజలకు సదుపాయాలు కల్పించే విషయంలో.. దేశాన్ని ముందుకు తీసుకెళ్లే విషయంలో పోటీ పడరు. కేవలం విద్వేషాన్ని రగిలించడం.. విషాన్ని.. చిమ్మడం.. దేశంలో అల్ల కల్లోలం సృష్టించడమే పాకిస్తాన్ పాలకుల పని.
మనతో విడిపోయిన నాటి నుంచి ఇప్పటివరకు పాకిస్తాన్ అన్ని రకాలుగా వెనుకబడిపోయింది. కానీ ఉగ్రవాద విషయంలో మనకంటే కోట్ల రెట్లు ముందుంది. మనం చదువును.. అభివృద్ధిని నమ్ముకుంటే.. పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదాన్ని నమ్ముకుంది. అందువల్లే మనదేశంలో గతంలో అనేక దారుణాలకు పాల్పడింది. ఇటీవల కాలంలో మన దేశం అంతర్గత భద్రత విషయంలో కఠినమైన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో పాకిస్థాన్ పప్పులు ఉడకడం లేదు.
పుల్వామా.. పహల్గాం వంటి దాడుల తర్వాత పాకిస్థాన్ నుంచి అక్రమ చొరబాట్ల విషయంలో భారత్ అత్యంత కఠినంగా ఉండడం మొదలుపెట్టింది. ఉగ్రవాదుల విషయంలో కఠిన చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. నిఘా వర్గాలకు.. భద్రతా దళాలకు విశేషమైన అధికారాలు కట్టబెట్టింది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ ఐఎస్ఐ సరికొత్త తెలివిని ఉపయోగిస్తోంది. ఇటీవల శ్రీనగర్ ప్రాంతంలో పోలీసులు కొంతమందిని అరెస్ట్ చేశారు. వారిని విచారించారు. వారు చెప్పిన మాటలు ఆందోళన కలిగించాయి. మనదేశంలో ఉన్న జాతీయ రాజకీయ పార్టీలలోకి పాకిస్థానీ దురంధర్ లను ప్రవేశపెడుతున్నట్టు ఆ వ్యక్తులు చెప్పారు. దీని వెనుక పాకిస్తాన్ ఐఎస్ఐ హస్తము ఉన్నట్టు చెప్పారు.
పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు.. ఐ ఎస్ ఐ అత్యంత కీలకమైన ప్రాంతాలలో ఓవర్ గ్రౌండ్ వర్కర్లను నియమించింది. వీరంతా కూడా రాజకీయ పార్టీలలో చేరుతారు.. తనిఖీల సమయంలో.. వారు రాజకీయ పార్టీల గుర్తింపు కార్డులను చూపిస్తారు. తద్వారా భద్రతా దళాల కన్ను కప్పుతారు. ఆ తర్వాత దాడులకు పాల్పడతారు. దీనివల్ల పాకిస్తాన్ పేరు తెరపైకి రాదు. ఆ వ్యక్తుల వెనుక ఉన్న ఐఎస్ఐ పేరు కూడా వెలుగులోకి రాదు. ఉగ్రవాద సంస్థల సంబంధించిన వివరాలు కూడా పోలీసు తెలుసుకోలేరు. ఎంతసేపటికి రాజకీయ పార్టీల కోణంలోనే ఆలోచిస్తారు.
విధ్వంసం సృష్టించడంతోపాటు.. ఆధారాలు కూడా లేకుండా చేయడం వల్ల పని ఈజీ అయిపోతుందని పాకిస్తాన్ ఐఎస్ఐ భావిస్తుందని ఇటీవల శ్రీనగర్ ప్రాంతంలో అరెస్ట్ అయిన యువకులు పోలీసుల విచారణలో చెప్పారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వారంతా కూడా సరిహద్దు ప్రాంతంలో నిఘాను కట్టుదిట్టం చేశారు. జాతీయ పార్టీలలో పనిచేసే కార్యకర్తల వివరాలను ఇవ్వాలని కోరారు.
వారు వాడే ఫోన్ నెంబర్లు.. వాట్సప్ ఖాతాలు.. సోషల్ మీడియా ఖాతాల వివరాలు తెలుసుకున్నారు. ఎవరైనా సంఘవిద్రోహకంగా.. చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని తేలితే వారిని అదుపులోకి తీసుకుంటున్నారు.. పాకిస్తాన్ దేశంలో ఉగ్రవాదం ఎలా ఉంటుందో ఇటీవల దురంధర్ అనే సినిమా ద్వారా వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఇదే విధానాన్ని పాకిస్తాన్ రివర్స్ లో మన మీద ప్రయోగించడం ఆందోళన కలిగిస్తోంది. దీనికి అడ్డుకట్ట వేయడానికి భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.
