Pakistan : పాకిస్తాన్ మొదట ఉగ్రవాదులను పంపింది. తరువాత డ్రోన్‌లను పంపింది.. తాజాగా ఇప్పుడు ప్రమాదకరమైన వైరస్‌ను తన కొత్త ఆయుధంగా మార్చుకుంది. భారత్ పాకిస్తాన్ అన్ని దాడులను సమర్థంగా ఎదుర్కోవడంతో ఇప్పుడు పాకిస్తాన్ ఇంటర్నెట్ ద్వారా భారతీయులను నష్టపరిచేందుకు సరికొత్త కుట్రకు పాల్పడుతోంది. నివేదికల ప్రకారం.. పాకిస్తాన్ ఇప్పుడు భారత్ మీద సైబర్ దాడికి రెడీ అవుతుంది. దీని కోసం ‘డాన్స్ ఆఫ్ ది హిల్లరీ’ అనే ప్రమాదకరమైన వైరస్‌ను ఒక ఫైల్‌లో పెట్టి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తోంది.
వాట్సాప్, ఫేస్‌బుక్, టెలిగ్రామ్ లేదా ఇమెయిల్ ద్వారా మీకు ఏదైనా తెలియని ఫైల్ వస్తే పొరపాటున కూడా ఆ ఫైల్‌పై క్లిక్ చేయవద్దు. లేకపోతే చిన్నపాటి నిర్లక్ష్యం కూడా చాలా పెద్ద నష్టాన్ని కలిగించవచ్చు. ఈ ఫైల్‌లో మాల్వేర్ ఉంది. ఇది మీ వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించగలదు. మీకు ఆర్థిక నష్టం కలిగించవచ్చు.
Also Read : పాకిస్తాన్ ప్రపంచం నుంచి ఎంత అప్పు తీసుకుందంటే?
డాన్స్ ఆఫ్ ది హిల్లరీ అంటే ఏమిటి?
ఇది ఒక ప్రమాదకరమైన మాల్వేర్, ఇది వీడియో ఫైల్, డాక్యుమెంట్ రూపంలో సర్క్యులేట్ అవుతుంది. ఈ మాల్వేర్ మీ పరికరంలోకి ప్రవేశించిన తర్వాత అది యాక్టివేట్ అవుతుంది. మీ బ్యాంకింగ్ వివరాలు దొంగిలించే ప్రమాదం ఉందని భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్ మీ వద్దకు తెలియని లింక్ లేదా అటాచ్‌మెంట్ రూపంలో చేరుకోవచ్చు.మీకు కనుక tasksche.exe అనే ఫైల్ కనిపిస్తే పొరపాటున కూడా ఆ ఫైల్‌పై క్లిక్ చేయవద్దు.
మాల్వేర్ దాడి నుంచి మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలి?
* యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించాలి.
* ఆపరేటింగ్ సిస్టమ్‌ను అప్‌డేట్ చేసుకోవాలి.
* అనుమానాస్పద లింక్‌లు, అటాచ్‌మెంట్‌లపై క్లిక్ చేయకుండా ఉండాలి.
* బలమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించాలి.
* యాప్‌లను డౌన్‌లోడ్ చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి.
సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్
పొరపాటున ఏదైనా తెలియని ఫైల్‌పై క్లిక్ చేస్తే.. ఒకవేళ మీకు నష్టం జరిగితే లేట్ చేయకుండా 1930 (నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్)కు కాల్ చేయాలి. జరిగిన సంఘటన గురించి సమాచారం ఇస్తూ ఫిర్యాదు చేయాలి.
Also Read : చివరికి దుబాయ్ కూడా ఒప్పుకోలేదు.. పాకిస్తాన్ సూపర్ లీగ్ కథ ముగిసినట్టే..