Pakistan : పాకిస్థాన్.. మన పొరుగు దేశం.. 1947, ఆగస్టు 14 వరకు మనతో కలిసి ఉన్న దేశం. బ్రిటిష్‌వారు అఖండ భారత దేశానికి స్వాతంత్య్రం ప్రకటించిన తర్వాత.. మన నుంచి విడిపోయి ముస్లిం దేశంగా ఏర్పడింది. మనం అనుమతి ఇస్తేనే ప్రత్యేక దేశంగా ఏర్పడిన పాకిస్తాన్.. నాటి నుంచి నేటి వరకు మనపైనే కాలుదువ్వుతోంది. మన ఎదుగుదలను ఓర్వలేకపోతోంది. అంతర్గత కలహారాలు, రాజకీయ సంక్షోభం, సైనిక తిరుగుబాటు.. ఇలా అనేక కారణాలతో పాకిస్థాన్ అనేకరంగాల్లో వెనుకబడే ఉంది. తాము ఎదగలేదు కాబట్టి భారత్ కూడా ఎదగ కూడదు.. అనేది ఒక కారణమైతే జమ్మూ కశ్మీర్‌ను ఆక్రమించుకోవాలన్నది ఇంకో కారణం. ఈ రెండు కారణాలతో పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది. భారత్‌లో అల్లర్లకు కారణమవుతోంది. ఇక భారత్‌లోని కొందరు కూడా పాకిస్తాన్‌కు మద్దతు తెలుపుతున్నారు. ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్.. పహల్గాం దాడి తర్వాత భారత్‌తో కయ్యానికి కాలుదువ్వుతోంది. సరిహద్దులు కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది.
Also Read : పహల్గామ్ ఉగ్రవాద దాడి.. ఇప్పుడే ఎందుకు?
అప్పులేనిదే పాలన సాగించలేని పరిస్థితిలో ఉన్న పాకిస్తాన్‌కు ప్రస్తుతం యుద్ధం చేసే దమ్ము ఉందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రోజు రోజుకూ పరిస్థితులు మారుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలపై దాడి చేస్తే.. తిరిగి ఎదుర్కొనే దమ్ము ఆ దేశానికి ఉందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సైనిక సామర్థ్యం పరంగా, పాకిస్తాన్ గణనీయమైన సైన్యం, ఆధునిక ఆయుధాలు, అణ్వాయుధ సామర్థ్యం కలిగి ఉంది. అయితే, భారత్‌తో పోలిస్తే, భారత్‌కు సైనిక సంఖ్య, ఆర్థిక బలం, సాంకేతిక ఆధునికత. అంతర్జాతీయ మద్దతు పరంగా గణనీయమైన పైచేయి ఉంది. 2023 గ్లోబల్ ఫైర్‌పవర్ ఇండెక్స్ ప్రకారం, భారత్ సైనిక శక్తిలో 4వ స్థానంలో ఉండగా, పాకిస్తాన్ 7వ స్థానంలో ఉంది. భారత్ యొక్క రక్షణ బడ్జెట్ (81 బిలియన్ డాలర్లు 2023లో) పాకిస్తాన్ (10 బిలియన్ డాలర్లు) కంటే చాలా ఎక్కువ. యుద్ధం జరిగితే, ఇరు దేశాల అణ్వాయుధ సామర్థ్యం కారణంగా పరిణామాలు వినాశకరంగా ఉంటాయి, ఇది రెండు దేశాలకు యుద్ధాన్ని అనుకూల ఎంపికగా మార్చదు. అంతేకాక, అంతర్జాతీయ సమాజం, ముఖ్యంగా యునైటెడ్ నేషన్స్ మరియు ప్రధాన శక్తులు, ఇటువంటి సంఘర్షణను నివారించడానికి జోక్యం చేసుకునే అవకాశం ఉంది.
ఆర్థిక సంక్షోభం..
పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం, దేశీయ సవాళ్లు కూడా దీర్ఘకాల యుద్ధాన్ని కొనసాగించే సామర్థ్యాన్ని పరిమితం చేస్తాయి. చరిత్రలో (1947, 1965, 1971, 1999 కార్గిల్ యుద్ధాలు) ఇరు దేశాలు యుద్ధాలు చేశాయి, కానీ ప్రస్తుత భౌగోళిక–రాజకీయ పరిస్థితులలో పూర్తి స్థాయి యుద్ధం అసంభవం. బదులుగా, రెండు దేశాలు సరిహద్దు ఘర్షణలు, దౌత్యపరమైన ఒత్తిళ్లు, పరోక్ష వ్యూహాలపై దృష్టి సారిస్తున్నాయి.
యుద్ధం వస్తే మరింత ఇబ్బందే..
పాకిస్తాన్‌కు కొంత సైనిక సామర్థ్యం ఉన్నప్పటికీ, భారత్‌తో పూర్తి స్థాయి యుద్ధం చేయడం దాని ఆర్థిక, వ్యూహాత్మక మరియు రాజకీయ పరిమితుల కారణంగా చాలా కష్టం. రెండు దేశాలు శాంతియుత సంబంధాలు లేదా తక్కువ–తీవ్రత ఘర్షణల ద్వారా తమ లక్ష్యాలను సాధించడానికి ప్రాధాన్యత ఇస్తాయి.