Pakistan Breaches Ceasefire: భారతదేశంతో కయ్యం పెట్టుకోవడం అంటే పాకిస్తాన్ కు బాగా ఇష్టం. ఎప్పుడూ ఏ రకంగా అవకాశం వచ్చినా.. వెంటనే ఉగ్రవాదులను భారత్ లోకి పంపడం.. ఇక్కడ అలజడి సృష్టించడం వంటి పనులు చేస్తుంటుంది. ఓ వైపు ఇలాంటి పనులు చేస్తూనే.. మరోవైపు భారత్ భార్డర్లో సైన్యంతో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉంటుంది. అయితే అక్టోబర్ వస్తుందన్న నేపథ్యంలో పాకిస్తాన్ కు చెడు ఆలోచనలు పుట్టుకొస్తాయి. ఎందుకంటే భారత్, పాకిస్తాన్ కు బార్డర్ లో ఉన్న సరిహద్దులో నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఉగ్రవాదుల రాకపోకలు చేయడానికి సాధ్యపడదు. అయితే ఈ లోపే ఏ విధంగానైనా భారత్ లోకి పంపాలని ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ లోని ముజఫరాబాద్ లో కొందరు ఉగ్రవాదులను సిద్ధం చేయగా.. వారిలో కొందరిని భారత్ మట్టి కరిపించింది. అసలు ఇక్కడున్న ఈ ప్రాంతంలో ఉగ్రవాదులను ఉంచుతుందంటే?
పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ లోని ముజఫరాబాద్ కు తూర్పున భారత్ కు లైన్ అఫ్ కంట్రోల్ లోని కొండ ప్రాంతాలలో నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు మంచు కురుస్తుంది. దీంతో ఈ కొండ ప్రాంతాలన్నీ మంచుతో కప్పబడి ఉంటాయి. దీంతో ఈ సమయంలో పాకిస్తాన్ నుంచి భారత్ కు ఉగ్రవాదులు చొరబడడానికి ఆస్కారం లేదు. ఈ ఆలోచనతో ఉన్న పాకిస్తాన్ ఇప్పటికే ఉగ్రవాదులను భారత్ లోకి పంపాలని చూస్తుంది. అయితే ఇక్కడ రెండు దేశాల మధ్య.. ముజఫరాబాద్ కు 80 కిలోమీటర్ల దూరంలో ఒక లోయ ఉంటుంది. దీనినే లీపా వ్యాలీ అని అంటారు. ఈ లోయలో ఉగ్రవాదులను తయారు చేసి భారత్ కు పంపే ఏర్పాట్లు చేస్తారు. అయితేఇక్కడున్న లాంచ్ ప్యాడ్స్ లో ఈ ఏడాది ఇప్పటి వరకు 20 మంది ఉగ్రవాదులను భారత సైన్యం కనుగొన్నది. వీరిలో 5గురిని తుదముట్టించింది.
అయితే ప్రతీ ఏడాదిలాగే ఈసారి కూడా సెప్టెంబర్ అక్టోబర్ మధ్య కాల్పులకు పాల్పడింది. ఇలా కాల్పులను జరిపి అల్లకల్లోలాన్ని సృష్టించి ఉగ్రవాదులను పంపే ప్రయత్నం చేస్తుంది. కానీ భారత్ మాత్రం ఈసారి కాల్పులను విజయవంతంగా తిప్పి కొట్టింది. ఇందులో భాగంగా పాకిస్తాన్ కు చెందిన రెండు చెక్ పోస్టులను ధ్వంసం చేసింది. రెండు ముఖ్యమైన దళాలను పేల్చేసింది. ఈ కాల్పుల్లో పాకిస్తాన్ కు భారీ నష్టం జరిగింది.
భారత్, పాకిస్తాన్ మధ్య ఉన్న లీపావలి అందమైన లోయ. ఈ లోయ పదివేల అడుగుల లోతులో ఉంటుంది. ఇక్కడున్న మోజో గ్రామంలో క్రెడా షరీఫ్ అనే మందిరం ఉంది. ఇక్కడ 1988 వరకు ఉర్సు ఉత్సవాలు జరిగేవి. ఇక్కడ ఇరు దేశాలకు సంబంధించిన వారు హాజరయ్యేవారు. ఇరు దేశాల సైన్యాలు బహుమతులు ఇచ్చుకునేవారు. కానీ 1988 -89 మధ్య జిహాది ఉగ్రవాదం పెరిగిన తరువాత ఉర్సు ఉత్సవాన్ని భారత్ నిషేధించింది. అయితే భారత్ కంట్రోల్ లో ఉన్న టూక్ మాలీ గ్రామంలో పాకిస్తాన్ నిత్యం దాడులకు పాల్పడుతూ ఉంటుంది. ఈసారి కూడా అదే చేసింది. కానీ భారత్ భయంకరమైన దాడులను పాకిస్తాన్ పై చేసి ఉగ్రవాదులను మట్టికరిపించింది. పహల్గాం తరువాత భారత్ బలం ఏంటో పాకిస్తాన్ కు అర్థమైంది. దీంతో ఇప్పుడు ఆ దేశం ఆచి తూచి అడుగులు వేస్తోంది.